కిడ్నీ ఆరోగ్యం, పనితీరు మనం రోజువారి వంటకాల్లో వినియోగించే వంటనూనెలపైనే ఆధారపడి ఉంటుంది.చెడు కొలెస్ట్రాల్ అధికంగా కలిగిన నూనెను వినియోగిస్తే కిడ్నీ పనితీరు మందగించి శరీరంలో మలినాలను విసర్జించడంలో లోపాలు తలెత్తుతాయి ఫలితంగా కిడ్నీలో ఇన్ఫెక్షన్ ప్రారంభమై తీవ్రమైన కిడ్నీ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరియు ఆరోగ్యకరమైన నూనెలను వినియోగిస్తే మన శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా లభించి విటమిన్ ఏ, డి, ఈ, కే లను కరిగించి మన శరీర అవసరాలకు అందిస్తుంది.
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు రోజువారి ఆహారంలో రైస్ బ్రాన్ ఆయిల్ వినియోగిస్తే శరీరంలో క్యాల్షియం శోషణను తగ్గిస్తుంది తద్వారా కిడ్నీలో రాళ్ల సమస్య పదేపదే వచ్చే అవకాశం ఉండదు. మరియు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను నివారించి గుండె ఆరోగ్యాన్ని, రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బాదం నూనెలో మోనో శాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి కావున వీటిని ఆహారంగా చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మరియు కిడ్నీ వ్యవస్థను బలోపేతం చేసి మలినాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది.
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు సన్ ఫ్లవర్ ఆయిల్ ను వినియోగించాలని సూచిస్తున్నారు. సన్ ఫ్లవర్ నూనెలో శక్తివంతమైన ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ను తొలగించడమే కాకుండా కిడ్నీ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అలివ్ ఆయిల్ లో అధికంగా ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎల్లప్పుడు కిడ్నీ ఆరోగ్యానికి తోడ్పడతాయి. శరీరంలో పొటాషియం మోతాదుకు మించి ఉంటే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి కావున అవకాడో నూనెలో పొటాషియం చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడేవారు వైద్య సలహాలు తీసుకొని మీకు ఇష్టమైన వంట నూనెను ఆహారంలో వినియోగించడం మంచిది.