Health Tips: మధుమేహ వ్యాధిగ్రస్తులు పరగడుపున ఈ నీటిని తాగటం వల్ల మధుమేహానికి చెక్ పెట్టవచ్చు తెలుసా?

Health Tips: ప్రతి ఇంటిలో వంటగదిలో ఉండే పప్పు దినుసులలో మెంతులు తప్పనిసరిగా ఉంటాయి. మెంతులు రుచికి చేదుగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . మెంతి గింజలలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వలన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. మెంతులు నానబెట్టి ఆ నీటిని త్రాగటం వలన అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

మెంతులు నానబెట్టిన నీటిని తాగటం వల్ల హెచ్ డి ఎల్ అని మంచి కొలెస్ట్రాల్ శరీరంలో పెరుగుతుంది. మెంతులు రాత్రిపూట ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగటం వలన కడుపు ఉబ్బరం , బద్ధకం , గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మెంతులు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గించి హృదయ సంబంధిత సమస్యలు దరిచేరకుండా చేస్తాయి. మెంతులలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.మెంతులను దోరగా వేయించి వాటిని పొడిచేసి నిల్వచేసుకోవాలి. ప్రతి రోజు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ మెంతిపొడి వేసుకొని తాగడం వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలిగి ఆకలి వేయదు తద్వారా అధిక బరువు సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

మెంతులలో అమైనో యాసిడ్స్ ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గిస్తాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారికి మెంతులు చాలా ఉపయోగపడుతాయి. మెంతి నీటిని ప్రతి రోజూ తాగటం వల్ల కిడ్నీ సమస్యల దూరమవుతాయి. మెంతులు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా చాలా ఉపయోగపడతాయి.

ఒక కప్పు మెంతులు రాత్రి నానబెట్టి ఉదయమే వాటిని పేస్ట్ లాగా చేసి పెరుగుతో కలిపి తలకు రాసుకోవడం వల్ల చుండ్రు సమస్య దూరమవుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.