Big Boss Telugu 5: బుల్లితెర ప్రసారం అవుతూ ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి.ఇప్పటికే తెలుగులో5 సీజన్లను పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే మరొక సీజన్ కు సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో ఏ కొందరికో మినహా మిగిలిన వారందరూ కూడా ఉన్న అవకాశాలను కూడా కోల్పోవడమే కాకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ద్వారా నెగిటివిటీ మూటగట్టుకున్నారు.
ఇకపోతే తాజాగా పూర్తి అయిన సీజన్ ఫైవ్ లో పాల్గొన్న షణ్ముఖ్ జశ్వంత్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ కార్యక్రమానికి వెళ్లక ముందు ఈయన పై ఎంతో గౌరవం ఉన్న అభిమానులు సైతం ఈ కార్యక్రమంలో ఆయన అసలు రూపాన్ని చూసి అసహ్యించుకుంటున్నారు. ఏకంగా తాను ప్రేమించిన తన ప్రేయసి దీప్తి సునయన కూడా ఇతనిని పక్కన పెట్టింది.
బిగ్ బాస్ కార్యక్రమంలో షణ్ముఖ్ జస్వంత్ చేసిన రొమాన్స్ అతని వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చింది. దీంతో టైటిల్ రేసులో ఉన్న షణ్ముఖ్ జస్వంత్ చివరికి రన్నర్ గా మిగిలిపోయారు. కేవలం రన్నర్ గా మిగిలడమే కాకుండా ఈయన ఎంతో నెగిటివిటీతో బయటకురావడం తన ప్రేయసి దూరమవ్వడం అన్ని చూస్తుంటే బిగ్ బాస్ కార్యక్రమం వల్ల షణ్ముఖ్ జస్వంత్ కు జరిగిన లాభం కన్నా నష్టమే అధికంగా ఉంది అని చెప్పవచ్చు.