పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీమ్.. ఈ పథకంతో రెండు లక్షల వరకు లాభం పొందండి!

పోస్ట్ ఆఫీస్ ఇప్పటికే ఎన్నో రకాల పథకాలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇలా పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల పథకాలను తీసుకురావడమే కాకుండా పోస్ట్ ఆఫీస్ స్కీములలో చేరే వారికి ఎంతో మంచి లాభాలను కూడా అందిస్తుంది. ఇక పోస్ట్ ఆఫీస్ ప్రకటించే పథకాలలో డబ్బును జమ చేయడం వల్ల ఎలాంటి అబద్ధ భావానికి గురికావాల్సిన పనిలేదు. ఇందులో మనం డిపాజిట్ చేసే ప్రతి ఒక్క రూపాయికి ఎంతో భద్రత ఉంటుందని చెప్పాలి.

ఇలా ఇప్పటికే ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన పోస్ట్ ఆఫీస్ తాజాగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే సరికొత్త స్కీం ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాలని చూస్తే.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌పై 7 శాతం వడ్డీ వస్తోంది. రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే ఈ స్కీం మెచ్యూరిటీ కాలం పూర్తి అయ్యేలోపు మీకు 1403 రూపాయలు లభిస్తాయి ఇలా ఈ స్కీం మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు గాను మీకు వడ్డీ రూపంలో 403 రూపాయల లాభాన్ని పొందవచ్చు.

ఈ స్కీమ్లో చేరటానికి 10 సంవత్సరాల వయసు పై పడిన వారి నుంచి ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఇలా మీరు సింగిల్ గా ఆయన లేదా జాయింట్ అకౌంట్ అయినా తెరవచ్చు. స్కీమ్ లో రూ. 1000 పెట్టి చేరచ్చు.
ఇందులో ఎంత డబ్బులైన పెట్టచ్చు. గరిష్ట పరిమితి లేదు. రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ కాలం పూర్తి అయ్యేలోపు మీరు ఏడు లక్షలు పొందవచ్చు ఇలా మీకు వడ్డీ రూపంలోనే రెండు లక్షల లాభం వస్తుంది. ఇక ఇందులో డబ్బు పొదుపు చేస్తే మోసం జరుగుతుంది అనే అపోహ కూడా ఏమాత్రం ఉండదు.