దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్బిఐ) తన కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఇప్పటికే వినియోగదారుల అవసరాల మేరకు ఎన్నో స్కీమ్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్స్ ద్వారా వినియోగదారులు కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్బిఐ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటిస్తూ ఉంది. వివిధ రకాల స్కీమ్స్ ద్వారా ఎంతో మంది ఎస్బిఐలో ఇన్వెస్ట్ చేసి అధిక మొత్తంలో ఆదాయం పొందుతున్నారు.
ఇటీవల ఆర్బీఐ రెపోరేట్ పెంచడంతో ఎస్బిఐ కూడా వడ్డీ శాతం పెంచింది. అలానే లోన్లపై వడ్డీలను కూడా పెంచింది. అదే విధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీలు కూడా ఇస్తోంది . ముఖ్యంగా సీనియర్ సిజిటన్ డిపాజిటర్లకు కూడా ఎక్కువ వడ్డీ రేటు ని ఇస్తోంది. ఇలా ఏడాదిలో మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లపై ఎక్కువ శాతం వడ్డీ అందిస్తోంది. ఏడాదిలోపు మెచ్యూర్ అయ్యి డిపాజిట్లపై అధిక శాతం వడ్డీ పొందాలనుకునే వారు ఎస్బిఐ లో ఇన్వెస్ట్ చేసి మంచి ఆదాయం పొందవచ్చు. ఉదాహరణకు ఏడాది టెన్యూర్ కోసం మీరు ఎస్బిఐలో రూ.1 లక్షల ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ పీరియడ్ అయ్యాక మీకు రూ.1,06,975 అందుకోవచ్చు. అంటే ఏడాదికి రూ. 6,975 అదనంగా పొందవచ్చు.
అలాగే రెండేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న వాటికి 6.75 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. రెండేళ్ల టెన్యూర్‌లో రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే రూ.14,888 వరకు అదనంగా పొందవచ్చు. ఇక మూడేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ కి 6.25 శాతం నుంచి 6.50 శాతం వడ్డీ వస్తుంది.మూడేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.21,341 అదనంగా ఆదాయం పొందవచ్చు. అలాగే 10 ఏళ్ల టెన్యూర్ కలిగిన ఎఫ్‌డీలో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే సీనియర్లకు అదనంగా రూ.1,10,200 వస్తాయి. అయితే సాధారణ ప్రజలకు రూ.90,500 వడ్డీ వస్తుంది.