ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ సర్కార్ కు మధ్య పొసగటం లేదనేది అందరికి తెలిసిన విషయం. దీనితో ఒకరి మీద మరొకరు దారుణమైన విమర్శలు చేసుకుంటూ ప్రజల ముందు రాజ్యాంగాన్ని నవ్వులు పాలు చేస్తున్నారు. ఈ రెండిటి మధ్య పంచాయితీ తేల్చటానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు.
తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు ఒక లేఖ రాశారని “వాళ్లు నన్ను విమర్శిస్తూ ఉన్నారు. వారిని పిలిచి మీరు మందలించండి. మీరు చర్యలు తీసుకోకపోతే నేను కోర్టుకు వెళ్తా..’ ఇదీ ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ సారాంశం అనే వార్తలు వస్తూ ఉన్నాయి. అవి ఎంత వరకు నిజమో కాదో తెలియదు కానీ మీడియా లో మాత్రం అవి చక్కర్లు కొడుతున్నాయి.
అధికార పార్టీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లు ఎస్ఈసీని విమర్శించారు. అలాగే ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల కూడా బహిరంగ విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని.. రాజ్ భవన్ కు పిలిచి మందలించాలని నిమ్మగడ్డ కోరినట్టుగా వార్తలు వస్తున్నాయి.అయితే ఇది కోరడంలా లేదని.. వారిని గవర్నర్ పిలిచి మందలించకపోతే తను కోర్టుకు వెళ్తానంటూ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారని కూడా పత్రికల్లో రాశారు. గవర్నర్ ను నిమ్మగడ్డ కోరినట్టుగా లేదని, గవర్నర్ ఏం చేయాలో ఆదేశించినట్టుగా ఉంది ఈ వ్యవహారం అని ప్రజలు అనుకోవాల్సి వస్తోంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ హద్దు మీరిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంటున్నారు. గవర్నర్ విచక్షణాధికారాలను కూడా నిమ్మగడ్డే శాసిస్తూ ఉన్నారనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయంలో తాము ప్రివిలైజ్ కమిటీని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారట ఏపీ మంత్రులు. ఒక పక్క నిమ్మగడ్డ కోర్టులు, గవర్నర్ అంటుంటే ఇటు పక్క మంత్రులు ప్రివిలేజ్ కమిటీ అంటూ మాట్లాడుతున్నారు, ఇవన్నీ గమనిస్తే ప్రజల కోసం కాకుండా కొందరి వ్యక్తుల మధ్యనున్న ఇగో కోసమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయమో అనే అనుమానం కలుగుతుంది.