రెండో పెళ్ళికి సిద్ధ‌మైన నాగార్జున బ్యూటీ.. ముహూర్తం కూడా చెప్పేసిన ముద్దుగుమ్మ‌

గ‌త ఏడాది నుండి సినిమా ఇండ‌స్ట్రీలో పెళ్ళి బాజాలు మోగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌గా ఉన్న వారంద‌రు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. గ‌త ఏడాది టాలీవుడ్‌లో చాలా మంది సెల‌బ్రిటీల పెళ్లిళ్లు కాగా, ఇప్పుడు బాలీవుడ్‌లో వ‌రుస పెళ్లిళ్ళ‌కు ముహుర్తాలు పెట్టుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ భామ దియా మీర్జా త‌న రెండో పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.

హైద‌రాబాద్‌లో పుట్టి పెరిగిన దియా మీర్జా సెటిల్ అయింది ముంబైలో. రెహానా హై తేరే దిల్ మే అనే బాలీవుడ్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన దియా.. త్వ‌ర‌లో తెలుగు సినీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. నాగార్జున న‌టించిన వైల్డ్ డాగ్ అనే సినిమాలో దియా మీర్జా న‌టించ‌గా, ఇందులో దియా పాత్ర ప్రేక్ష‌కుల‌ని మెప్పించేలా ఉంటుందట‌. అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డు త‌న రెండో పెళ్లితో హాట్ టాపిక్‌గా మారింది. 2014లో సాహిల్ సంఘ అనే వ్యాపార వేత్త‌ను పెళ్ళాడిన దియా 2019లో అత‌నికి విడాకులు ఇచ్చేసింది. తన మాజీ భర్తతో విడిపోయిన విషయం కూడా సోషల్ మీడియాలో ప్రకటించింది అమ్మడు.

ఇక కొద్ది కాలంగా వైభవ్ రేఖి అనే వ్యాపారవేత్తతో ప్రేమాయ‌ణంలో ఉన్న దియా మీర్జా ఫిబ్ర‌వ‌రి 15న అత‌నితో పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మైంది. కరోనా వ‌ల‌న కొద్ది మంది బంధువులు, స్నేహితుల స‌మ‌క్షంలో వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం దియాకు సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి త‌ర్వాత దియా మీర్జా .. వైభవ్ రేఖితో కలిసి బాంద్రాలోని పాలిహిల్ ప్రాంతంలో నివసించునుందట. నాలుగు పదుల వయసు దగ్గర పడిన దియా మీర్జా.. హైదరాబాద్ నాజర్ పాఠశాలలో స్కూలింగ్ స్టాన్లీ కాలేజీలో విద్యను పూర్తి చేసిందట. 2000లో మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత మోడలింగ్ చేస్తూ సినిమాలలో రాణించింది.