టీఆర్ఎస్‌కు తగులుతున్న ధరణి సెగ.. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందా.. ??

 

ప్రత్యేక తెలంగాణ వస్తే ఇక్కడి ప్రజల కష్టాలన్ని తీరుతాయి.. ఉపాధి అవకాశాలు పెరిగి జీవితాలు బాగుపడతాయని ఎందరో తెలంగాణ ప్రజలు కలలు కన్నారు.. ఇలా ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు కూడా చేశారు.. కానీ ప్రాణాలు అర్పించిన కుంటుంబాలు కష్టాల్లోకి వెళ్లిపోగా తెలంగాణ కోసం ఉన్న ఒక్క కొడుకును కూడా పోగొట్టుకుని అష్టకష్టాలు పడుతున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు.. ఇక తెలంగాణ వచ్చాక బాగుపడ్ద కుటుంబాలు ఎవరంటే దోరల కుటుంబాలు, ఇన్నాళ్లూ వేరే పార్టీలో రాజకీయాలు వెలగబెట్టిన నాయకులు మాత్రమే అని జనాలు అనుకుంటున్నారట..

ఇదే కాకుండా టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీయార్ కుటుంబం కోసమే పెట్టిన పార్టీ అనే ప్రచారం కూడా ఉంది.. ఇదంత పక్కన పెడితే అభివృద్ధి జరిగిన తెలంగాణాలో కొత్తగా చేసిన అభివృద్ధి పనులేంటో ప్రజలకు అర్ధం కావడం లేదట.. అప్పులు మాత్రం మోపెడు బండలా మారి పేదప్రజల బ్రతుకులు చిరిగిన గుడ్దపీలికల్లా దినదినం మారుతున్నాయని వాపోతున్నారట నిజాలు గ్రహించిన వారు.. అదీగాక చైనా వాడి బ్రాండ్ అయిన కరోనా ఇండియాలో కాలు పెట్టగానే భారతదేశం మొత్తం స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయింది.. దీని ఫలితంగా ప్రస్తుతం ఉపాధి లేదు, సరిపడంత ఆదాయం లేదు.. పూటగడవడమే కష్టంగా మారింది.. బయట నిత్యావసరాల నుండి అన్ని సరకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.. ఇన్ని క్లిష్ట పరిస్దితుల మధ్య తెలంగాణ ప్రజల ఒంటిమీద ఉన్న గుడ్దముక్కను కూడా అమ్ముకుని బిచ్చగాళ్లలా బ్రతకమని హెచ్చరించేలా అధికారిక ప్రభుత్వం ప్రవర్తిస్తుందని ప్రజలు గోలచేస్తున్నారట..

ఇవన్ని పక్కన పెడితే భార్య పుస్తెలు అమ్మి, ఎన్నో కష్టాలు పడి కొనుక్కున భూముల నుండి ఎల్ఆర్ఎస్ పేరిట ప్రభుత్వ దోపిడి ప్రారంభం అవడంతో తెలంగాణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారట.. ఇక కేసీఆర్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఆస్తుల ఆన్ లైన్ నమోదు ప్రక్రియ ప్రజలకు ఎంతవరకు ఉపయోగ పడుతుందో తెలియదు కానీ ప్రభుత్వ ఖజానా మాత్రం భారీగా నిండటానికి పనికొస్తుందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.. ఇంతే కాకుండా నిన్నమొన్నటి వరకు లాక్​ డౌన్​తో ఉపాధి కోల్పోయి ఉన్న ప్రజలను ఇంటి, నల్లా పన్నులు కట్టాలని గ్రామపంచాయతీల ఆఫీసర్లు బలవంతం చేస్తున్నారట. లేదంటే ప్రాపర్టీ సర్వే వివరాలు ఆన్​లైన్​లో ఎంటర్​ చేయమని హెచ్చరిస్తున్నారట.

దీంతో తెలంగాణ ప్రజలు ఆర్థికంగా మరింత ఇబ్బంది పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో అప్పులు తెచ్చి మరీ పన్నులు కడుతున్నారు. పన్ను కడితేనే ప్రాపర్టీ వివరాలు నమోదు చేయాలని సర్కారు నుంచి ఎలాంటి ఆదేశాలు లేకున్నా లక్ష్యం చేరుకోవాలనే ఉద్దేశంతో కిందిస్థాయి ఆఫీసర్లు, పంచాయతీ సిబ్బంది జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.. ఇదిలా ఉండగా ధరణి పోర్టల్ లో ప్రజల ఆస్తుల నమోదుకు చట్టబద్ధత లేదంటూ దాఖలైన పిటిషన్ పై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొందరు ధరణి పోర్టల్ ను వ్యతిరేకిస్తూ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై జస్టిస్ షమీమ్ అక్తర్ శనివారం విచారణ చేపట్టారు. కాగా ప్రజల ఆస్తుల వివరాలను సేకరించి వెబ్‌ పోర్టల్‌‌లో పెట్టే విధానాన్ని పిటిషనర్ తరపు లాయర్ శశికిరణ్ తప్పుపట్టారు.

ఇప్పటికే ఆదాయ పన్నుచట్టం కింద పాన్‌‌ కార్డు, వాహన చట్టం కింద డ్రైవింగ్‌ లైసెన్స్, ఆధార్‌‌ చట్టం కింద ఆధార్‌‌ ఉండగా, కొత్తగా ధరణి వెబ్‌ పోర్టల్‌‌లో ప్రజల ఆస్తుల నమోదుకు ఏ చట్టం ఉందో ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. అసలే ఎందులో కూడా భద్రత లేకుండా బ్రతుకుతున్న రోజుల్లో చట్ట వ్యతిరేకంగా ఒక వెబ్‌ పోర్టల్‌‌ పెట్టి ప్రజల ఆస్తుల వివరాలను అందులో నమోదు చేస్తే అవన్నీ గోప్యంగా ఎలా ఉంటాయని ప్రశ్నించారు.. ఒకరకంగా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నట్లే అని ఆరోపించారు.. ఇన్నాళ్లు ఏది చేసిన నోరు మెదపని ప్రజల నుండి ధరణి సెగ టీఆర్ఎస్‌కు గట్టిగానే తగులుతున్నదంటున్నారట విశ్లేషకులు..