‎Dhanush: సంచలన నిర్ణయం తీసుకున్న ధనుష్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

‎‎Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి మనందరికీ తెలిసిందే. ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ మధ్యకాలంలో ధనుష్ నటించిన సినిమాలు కూడా వరుసగా హిట్ అవుతున్నాయి. దీంతో అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీ హోదాను దక్కించుకున్న తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అలా సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తులలో మొదటి వ్యక్తి ఎన్టీఆర్.

‎టిడిపి అనే పార్టీని స్థాపించడంతోపాటు రాజకీయాలను మొదలుపెట్టిన వ్యక్తి కూడా ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఈయనతో పాటు ఎంజీఆర్‌, జయలలిత వంటి వారు సినిమా రంగంలో భారీగా అభిమానులను, ఆదరాభిమానాలను అందుకుని ,రాజకీయరంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రులుగానూ ప్రజాదరణ పొందారు. ఆ తరువాత కమల్ హాసన్‌, విజయకాంత్‌ వంటి వారు రాజకీయ రంగప్రవేశం చేసి ప్రజల్లో ఉన్నారు. ఇక రజనీకాంత్‌ ఆ ప్రయత్నం చేసినా, ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు విజయ్‌ రాజకీయాల్లో రాణించడానికి రంగంలోకి దిగారు.

‎ అయితే ఇప్పుడు హీరో ధనుష్‌ కూడా అదే బాటలో పయనించబోతున్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్‌, విజయ్‌ వంటి నటుల బాటలో ధనుష్‌ పయనించనున్నారు. అవును తన అభిమానులను కలిసి వారితో ఫొటోలు దిగి ఉత్సాహపరచడానికి ఆయన సిద్ధమయ్యారు. అందుకు ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గత వారమే ధనుష్‌ తన అభిమానులను కలుసుకోవలసి ఉంది. అందుకు స్థానిక సాలిగ్రామంలో ఒక స్టూడియోను కూడా 25 వారాల పాటు వారానికి ఒక్క రోజు అభిమానులను కలుసుకునే విధంగా బుక్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే నిజానికి గత వారమే ధనుష్‌ అభిమానులను కలుసుకోవలసి ఉందనీ, అయితే ఆయన కాలికి దెబ్బ తగలడం వల్ల ఆ వారం వాయిదా పడిందని సమాచారం. కాగా ఈ నెల 27వ తేదీ నుంచి ప్రతివారం 500 మంది అభిమానులను కలిసి మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇలా అభిమానులను కలవాలన్న ధనుష్‌ సంచలన నిర్ణయం వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందా అనే చర్చ కోలీవుడ్‌ వర్గాల్లో జరుగుతోంది. గతంలో రజనీకాంత్‌, విజయ్‌, కమల్‌ హాసన్‌ వంటి వారు మొదట అభిమానులతో ఫోటో కార్యక్రమం పెట్టి వారితో మరింత దగ్గర అయ్యాక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాంటి ఆలోచనలోనే ఇప్పుడు హీరో ధనుష్ ఉన్నట్టు తెలుస్తోంది.