Dhanush : గ్రే మాన్ గా ధనుష్… హాలీవుడ్ సినిమా పోస్టర్ తో కేక పుట్టించిన ధనుష్…!

Dhanush : ఎవెంజర్స్: ఎండ్‌గేమ్‌కి పేరుగాంచిన రస్సో బ్రదర్స్, ఆంథోనీ మరియు జో రస్సో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన గ్రే మాన్ సినిమా ధనుష్ నటిస్తున్న రెండో హాలీవుడ్ సినిమా . ఇక ఈ సినిమా పోస్టర్ విడుదల చేసారు. ఇందులో ధనుష్ కార్ టాప్ పై ఉంది నుదుటి పై ఘాటు తో కేక పుట్టిస్తున్నాడు. ఇక మారన్ అభిమానులకు పండగనే చెప్పాలి. క్రిస్ ఎవాన్స్, ర్యాన్ గోస్లింగ్, రెజ్-జీన్ పేజ్, అనా డి అర్మాస్, బిల్లీ బాబ్ థోర్న్టన్, జెస్సికా హెన్విక్ మరియు వాగ్నెర్ కూడా గ్రే మాన్ లో నటించారు.

ఈ చిత్రం అదే పేరుతో మార్క్ గ్రీనీ యొక్క తొలి నవల ఆధారంగా రూపొందించబడింది. జెస్సికా హెన్విక్, వాగ్నెర్ మౌరా మరియు జూలియా బటర్స్ కూడా స్పై-థ్రిల్లర్‌లో భాగంగా ఉన్నారు. జులై 22 న నెట్ ఫ్లెక్స్ లో ప్రసారం కాబోతోన్న ఈ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అంటూ ఐశ్వర్య లక్ష్మి పోస్ట్ పెట్టింది. ఇక అద్భుతం బ్రో అంటూ ప్రసన్న కామెంట్ చేసాడు.

ధనుష్ కు ఇది రెండవ అంతర్జాతీయ సినిమా.ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్‌తో 2018లోనే ధనుష్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. గ్రే మ్యాన్ ఇద్దరు CIA అధికారుల కథ చుట్టూ తిరుగుతుంది. CIA కార్యకర్త అయిన సియర్రా సిక్స్ అని పిలువబడే కోర్ట్ జెంట్రీ పాత్రలో ర్యాన్ గోస్లింగ్ నటించాడు. మరియు, కెప్టెన్ అమెరికా క్రిస్ ఎవాన్స్ విలన్. ఎవాన్స్ మాజీ CIA సభ్యుడు లాయిడ్ హాన్సెన్ పాత్రను పోషించాడు.