వైరల్ : హాలీవుడ్ లో ధనుష్ మైండ్ బ్లాకింగ్ ఎంట్రీ సీన్ వీడియో చూసారా.?

ప్రపంచ సినిమా దగ్గర హాలీవుడ్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉండేది ఇంగ్లీష్ వ్యక్తులే కావడంతో ఈ మార్కెట్ కూడా చాలా పెద్దదే అని చెప్పాలి. మరి హాలీవుడ్ సినిమాల్లో కూడా పలు వర్గాలు ఉంటాయి.

అందులో స్టార్ దర్శకుల సినిమాలు హీరోలు అని చాలా ఉంటాయి. ఇంకా హాలీవుడ్ అంటే చాలా వరకు సూపర్ హీరోల సినిమాలే అనుకోవచ్చు కానీ వాటితో పాటుగా ఎన్నో భారీ యాక్షన్ సినిమాలు కూడా ఉంటాయని చెప్పాలి. అయితే ఇప్పుడు అలాంటి సూపర్ హీరో సినిమా చేసిన డైరెక్టర్స్, హీరో కాంబోలో ఓ యాక్షన్ సినిమా పడింది.

అదే “ది గ్రే మ్యాన్”. అవెంజర్స్ సిరీస్ దర్శకులు రస్సో బ్రదర్స్ మరియు కెప్టెన్ అమెరికా హీరో క్రిస్ ఇవాన్స్ ల కాంబోలో మన ఇండియన్ సినిమా నుంచి హీరో ధనుష్ కూడా కీలక పాత్ర చేసాడు. గతంలో ట్రైలర్ అంతకు ముందు అనౌన్సమెంట్ లో కూడా చూపించారు.

కానీ తాజాగా అయితే దర్శకుడు ధనుష్ పై ఏ లెవెల్ ఏక్షన్ ని డిజైన్ చేసారో ఓ వీడియోలో చూపించారు. మరి ఇది మాత్రం మైండ్ బ్లాకింగ్ అని చెప్పాలి. బహుశా ఇదే ధనుష్ ఎంట్రీ సీన్ లా అనిపిస్తుంది. దీనిని హాలీవుడ్ సినిమా నుంచి ఏ లెవెల్ యాక్షన్ తో చూస్తామో అందుకు తగ్గట్టుగా ఉంది. దీనిని ధనుష్ కూడా ఊహించని రీతిలో చేసేసాడు. మరి ఇది అయితే ట్విట్టర్ లో షేర్ చేశారు కింద ఆ విజువల్స్ చూడవచ్చు.