Tirumala: పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత కొంతకాలంగా వరుస అపచారాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. నిజానికి ఆలయ గోపురంపై విమానాలకు అనుమతి లేదు నో ఫ్లయింగ్ జోన్ గా ఉన్నటువంటి ఈ తిరుపతి ఆలయం పై ఇటీవల వరుసగా విమానాలు వెళ్తున్నాయి స్వయంగా విమానాయ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినప్పటికీ కూడా ఈ పద్ధతిని అరికట్ట లేకపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున తిరుమల కొండపై వరుసగా అపశృతిలో చోటు చేసుకుంటున్న ఇటీవల కొంతమంది మద్యం తాగుతూ హల్చల్ చేశారు. అలాగే మరి కొంతమంది ఇక్కడ నాన్ వెజ్ కూడా తిన్న విషయం తెలిసిందే అయితే తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా మరొక ఆపచారం చోటుచేసుకుంది.
తాజాగా స్వామివారి దర్శించడం కోసం ముగ్గురు వ్యక్తులు ఏకంగా చెప్పులు వేసుకుని దర్శనానికి రావడంతో ఈ విషయం కాస్త ఆ భక్తులను ఆందోళనకు గురిచేస్తుంది.తిరుమల ఆలయం మహాద్వారం వరకూ పాదరక్షలతో వచ్చిన ముగ్గురు భక్తులు పాదరక్షలతోనే ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
మహాద్వారం వరకూ భక్తులు రావడానికి ముందు మూడు ప్రాంతాలలో ఉన్న తనిఖీలను వారు దాటుకుని వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పాదరక్షలతో మహాద్వారం వరకూ మధ్యలో తనిఖీలను దాటుకుని భక్తులు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇలా మూడు చోట్ల భక్తులను తనిఖీ చేసినప్పటికీ ఈ ముగ్గురు భక్తులు చెప్పులు వేసుకున్నటువంటి విషయాన్ని అధికారులు గుర్తించలేకపోవటంతో అక్కడ ఎలాంటి భద్రత లోపాలు ఉన్నాయో స్పష్టం అవుతుంది.మహాద్వారం వద్ద ముగ్గురు భక్తులు చెప్పులతో భక్తులు ఉండటాన్ని భద్రతా సిబ్బంది గుర్తించి వారిని నిలిపివేశారు. దాంతో ఆ భక్తులు చెప్పులను మహాద్వారం వద్దే వదిలేసి స్వామి వారి దర్శనానికి లోనికి వెళ్లారు. అసలు మహాద్వారం వరకూ భక్తులు చెప్పులతో వస్తుంటే విజిలెన్స్, టీటీడీ అధికారులు ఏంచేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వం లడ్డులో కల్తీ చేసింది అంటూ ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున సనాతన ధర్మం గురించి క్లాసులు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో జరుగుతున్న ఘటనలపై స్పందించకపోవడంతో సనాతన ధర్మవాది ఎక్కడ… తిరుమల కొండపై జరుగుతున్న ఈ ఘటనలు మీకు కనిపించలేదా అంటూ విమర్శలు చేస్తున్నారు.