Gallery

Home News యాంక‌ర్ ప్ర‌దీప్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ స‌పోర్ట్‌.. ఇక త‌గ్గేదే లేదంటున్న క్రేజీ స్టార్

యాంక‌ర్ ప్ర‌దీప్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ స‌పోర్ట్‌.. ఇక త‌గ్గేదే లేదంటున్న క్రేజీ స్టార్

బుల్లితెర‌పై స‌త్తా చూపుతున్న చాలా మంది స్టార్స్ వెండితెర‌పై కూడా అదృష్టం ప‌రీక్షించుకోవాల‌ని భావిస్తున్నారు. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాపుల‌ర్ అయిన సుడిగాలి సుధీర్, గెట‌ప్ శీను,ఆటో రామ్ ప్ర‌సాద్‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, ష‌క‌ల‌క శంక‌ర్ వీరంద‌రు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కొన్ని సినిమాలు చేశారు. యాంక‌ర్ ర‌వి కూడా హీరోగా ప‌లు చిత్రాలు చేశాడు. ఇక ఇప్పుడు ప్ర‌దీప్ మాచిరాజు టైం వ‌చ్చింది. 30 రోజుల‌లో ప్రేమించ‌డం ఎలా అనే టైటిల్‌తో సినిమా చేయ‌గా, ఈ మూవీకి క‌రోనా అడ్డుప‌డింది. గ‌త ఏడాది విడుద‌ల చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ, క‌రోనా వ‌ల‌న థియేట‌ర్స్ అన్నీ మూత‌ప‌డ‌డంతో మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తూ వ‌చ్చారు. చివ‌రికి ఈ నెల 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న‌ట్టు పేర్కొన్నారు.

Vijay 2 | Telugu Rajyam

ప్రదీప్‌ మాచిరాజు, అమృతా అయ్యర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. మున్నా దర్శకుడు. ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. ‘రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఓ జంట ప్రేమపయనంలోని మధుర భావాలకు అందమైన దృశ్యరూపంగా ఉంటుంది. సుకుమార్ వ‌ద్ద ‘ఆర్య-2’, ‘వన్‌ నేనొక్కడినే’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. మూవీ మంచి విజ‌యం సాధిస్తుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుండి విడుద‌లైన ‘నీలి నీలి ఆకాశం..’ పాట యూట్యూబ్‌లో 218 మిలియన్లకి పైగా వ్యూస్‌ను సాధించింది. మిగతా పాట‌ల‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. శివన్నారాయణ, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ సంగీతం అందించారు. మ‌రి కొద్ది రోజుల‌లో సినిమా విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఈ రోజు సాయంత్రం 5.15నిల‌కు యూత్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ట్రైల‌ర్ రిలీజ్ చేయించ‌నున్నారు. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

- Advertisement -

Related Posts

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం.. పార్టీల మధ్యనా.? ప్రభుత్వాల మధ్యనా.?

ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ఇంకోసారి భగ్గుమంది. రాజకీయ నాయకులు మాట మీద అదుపు కోల్పోతున్నారు. తెలంగాణ నుంచే దూకుడుగా అనవసరపు మాటలు వస్తున్నాయి. ఆంధ్రపదేశ్ నుంచి కాస్త సంయమనమే...

China Spy: భారత్ లో చైనా గూఢచారి..! విచారణలో కలకలం రేపే అంశాలు..

China Spy: ఈనెల రెండో వారంలో బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం మాల్దా వద్ద ‘హాన్ జున్వే’ అనే చైనా గూఢచారి అరెస్టయిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా అతను వెల్లడిస్తున్న విషయాలు కలకలం...

ప్రచారం సరిపోదు.. నేరస్తులపై సీరియస్ ‘యాక్షన్’ వుండాల్సిందే

ఆంధ్రపదేశ్ రాజధాని (వైఎస్ జగన్ ప్రభుత్వం అంగీకరించినా అంగీకరించకపోయినా) అమరావతి పరిధిలో అత్యంత హేయమైన ఘటన జరిగింది. ఓ యువతిపై, ఆమెకు కాబోయే భర్త సమక్షంలోనే లైంగిక దాడి జరిగింది. అదీ, అమరావతిలో.....

Latest News