ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నద్దమయ్యారు. ప్రజెంట్ ఉన్న 13 జిల్లాలకు ఇంకో 12 కొత్త జిల్లాలను కలిపి మొత్తం 25 జిల్లాలుగా చేయాలనేది ప్లాన్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తారట. ఈ మేరకు రానున్న కొత్త జిల్లాలు ఏవి, వాటిలోకి చేరబోయే మండలాలు ఏవి అనే వివరాలు బయటికొచ్చాయి. వాటిని పరిశీలిస్తే పాత జిల్లాల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు కొత్త జిల్లాల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది ప్రభుత్వం. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది 26న గంతంత్య్ర దినోత్సవం నాడు కొత్తగా ఏర్పాటుకానున్న జిల్లాలను ప్రకటిస్తారు జగన్.
అయితే మొదట పాత 13 జిల్లాలకు కొత్తగా 12 కలుపుకుని 25 జిల్లాలుగా చేయాలని అనుకున్నారు. కానీ అరకు లాంటి కొన్ని జిల్లాల విషయంలో చిక్కులు వచ్చాయి. విడదీయక ముందు కొన్ని పార్లమెంట్ నియోజవర్గాలు ఒకటి కంటే ఎక్కువ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. దీంతో వాటి మధ్యన ఆ నియోజకవర్గాన్ని పంచడం కుదరలేదు. అందుకే అలాంటి వాటిని కూడ ప్రత్యేక జిల్లాలుగా మార్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయట. ఆ విధంగా 25 జిల్లాల సంఖ్య కాస్త 32కు పెరిగిపోయిందట. అయితే ఇప్పటివరకు ఈ జిల్లాలు కేవలం ప్రతిపాదనలుగానే ఉన్నాయి కానీ ఇంకా ఫైనల్ కాలేదు.
ఈ నెల 21 లోగా అసెంబ్లీ సమావేశాలు జరపాల్సి ఉంది. అందుకోసం 15 నుంచి సమావేశాలు జరపాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ సమావేశాల్లో కొత్త జిల్లాల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందట. అదే జరిగి సభలో బిల్లు ఆమోదం పొందితే 32 జిల్లాకు ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కొత్త జిల్లాలుగా చెప్పబడుతున్న పేర్లను చూస్తే వాటిలో లాసా, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, కాకినాడ,రాజమండ్రీ, అమలాపురం, నర్సాపురం, ఏలూరు, మచిలిపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, బాపట్ల, నరసారావుపేట, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, హిందూపురం, అనంతపురం, అదోని, కర్నూల్, నంధ్యాల, కడప, రాజంపేట ఉన్నాయి.