Y.S.Jagan: ఏపీ మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. ఇలా లిక్కర్ స్కాంలో భాగంగా ఇప్పటికే కొంతమంది కీలక వ్యక్తులు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మద్యం కుంభకోణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఏ క్షణమైన అరెస్ట్ కావచ్చని వార్తలు కూడా వినపడుతున్నాయి. ఇక జగన్ అరెస్ట్ గురించి మాట్లాడటం కోసమే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రులతోను భేటీ అయ్యారు.
జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పైన ఆధారపడలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పై ఆధారపడి ఉన్న నేపథ్యంలోనే జగన్ అరెస్ట్ గురించి సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి కూడా తీసుకువస్తున్నారని తెలుస్తుంది. అయితే కేంద్రం మాత్రం జగన్ అరెస్టుకు నో అని సమాధానం చెబుతున్నట్టు సమాచారం. మరి జగన్ అరెస్ట్ కు కేంద్రం నో చెప్పడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే….
మద్యం కుంభకోణంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టు అయ్యి ఆయన అప్రూవర్‌గా మారితే.. వైసీపీ హయాంలో సెకీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, చేతులు మారిన ముడుపులు, ఇంకా కమలం పార్టీ ఎన్నికల ఖర్చుకు సర్దుబాటు చేసిన నిధుల వివరాలన్నీ బయటపడే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
ఏపీలో వైసీపీ బలపడిన, బలహీనపడిన తెలుగుదేశం పార్టీ బలపడిన, బలహీనపడిన బిజెపికి వచ్చే నష్టమేమీ లేదు. ఈ రెండు పార్టీల ఎంపీలు ఎప్పుడూ కూడా బీజేపీకి అండగా ఉంటుంది. అందువల్లనే ఇక్కడ వైసీపీని అణగదొక్కే ఏ చర్యకు కేంద్ర పెద్దలు సహకరించడం లేదని కూటమి పక్షాల నేతల నుంచి వ్యక్తమవుతోంది.