Shanmukh: బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్ళిన షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన యూట్యూబ్ ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకొని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు బిగ్ బాస్ టైటిల్ షణ్ముఖ్ జస్వంత్ అని భావించారు.ఇలా కొన్ని వారాల పాటు టాప్ లో ఉన్న షణ్ముక్ సిరితో చేసిన స్నేహం కారణంగా అతడు టైటిల్ గెలవలేక పోయాడు. ఇలా తనతో తరచూ హాగ్గులు, కిస్సులు అంటూ రొమాన్స్ చేయడంతో అతని క్యారెక్టర్ దిగజారిపోవడమే కాకుండా టైటిల్ కి కూడా దూరమయ్యారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో విన్నర్ అవ్వాల్సిన షణ్ముఖ్ కాస్త రన్నర్ అయ్యారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షణ్ముఖ్ జస్వంత్ తను రన్నర్ అవుతానని ముందుగానే ఊహించామని వెల్లడించారు. 11వ వారం సిరితో జరిగిన గొడవ కారణంగా సన్నీ విన్నర్ గా నేను రన్నర్ గా నిలబడతానని భావించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ను పిలిపించినప్పుడు షణ్ముఖ్ జస్వంత్ కోసం దీప్తి సునైనా వచ్చింది. అప్పుడు ఆమె రెండు వేళ్ళతో మైక్ పట్టుకొని ఇండైరెక్ట్ గా తనకు రెండవ స్థానంలో ఉన్నావని హింట్ ఇచ్చిందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయింది.
ఇలా దీప్తి సునయన తన గురించి వస్తున్న వార్తలను పూర్తిగా ఖండించినది.ఈ విషయంపై షణ్ముఖ్ జస్వంత్ మాట్లాడుతూ అమ్మతోడు ఆ విషయం నాకు అసలు తెలియదు అయినా దీప్తి సునైనా ఎప్పటికీ అలా చెయ్యదు. నాకు చీటింగ్ చేయడం రాదు ఒకవేళ దీప్తి అలా చెప్పి ఉంటే నేను నీతో ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేసే వాడిని కాదు దీప్తి తనకు ఎలాంటి హిట్ కానీ సిగ్నల్స్ కానీ ఇవ్వలేదని షణ్ముఖ్ ఈ సందర్భంగా తెలియజేశారు.