Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మళ్ళీ వెనుదిరిగి చూడలేదు. బ్యాక్ టూ బ్యాక్ వరుస హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది దీపికా. బిడ్డ పుట్టిన తర్వాత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న దీపికా ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రాబోతున్న స్పిరిట్ చిత్రంలో ఈ అమ్మడు నటించనున్నట్లు ప్రచారం నడిచింది. కానీ కొన్ని కారణాలతో ఆమెను తప్పించి దీపికా స్థానంలోకి త్రిప్తి డిమ్రిని తీసుకున్నారని టాక్. ఇక నిన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన సంచలన ట్వీట్ తో మరోసారి దీపికా పేరు తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా దీపికా చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపికా అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యం. దానికే ప్రాధాన్యత ఇస్తాను. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తన మనసు చెప్పేది వింటాను. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను అని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. గత రెండు రోజులుగా ఈ అమ్మడు పేరు నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీపికాకు సంబంధించిన పీఆర్ టీం స్పిరిట్ సినిమా స్టోరీని లీక్ చేసిందంటూ ప్రచారం నడిచింది. అందుకే డైరెక్టర్ సందీప్ రెడ్డి ధీటుగా కౌంటర్ ఇస్తూ నిన్న ట్వీట్ చేసినట్లుగా అభిప్రాయపడుతున్నారు నెటిజన్స్. ఈ క్రమంలో ఇప్పుడు దీపికా మాట్లాడిన మాటలు మరోసారి వైరల్ అవుతున్నాయి.