Crime: మూడు రోజులుగా భర్త మృతదేహంతోనే.. చివరికి అలా.?

Crime: తాజాగా కర్ణాటకలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భర్త చనిపోయిన మూడు రోజులు అవుతున్నా కూడా ఆ విషయాన్ని బయటివారికి చెప్పకుండా దాచి పెట్టింది ఒక భార్య. అసలేం జరిగిందంటే. కర్ణాటకలో హుబ్లీ నవ నగర ఎల్ ఐ జి వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ధార్వాడలోని ఎత్తినగుడ్డ నివాసి మంజునాథ అబ్బిగెరె అనే వ్యక్తి తొమ్మిదేళ్ల క్రితం యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎల్‌ఐజీ వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. తాజాగా ఆ ఇంటినుంచి దుర్వాసన వస్తుండటంతో వెంటనే స్థానికులు ఏపీఎంసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు వచ్చి పరిశీలించగా మంజునాథ విగతజీవిగా కనిపించాడు. అయితే అప్పటికే మంజునాథ మూడు రోజుల క్రితమే చనిపోయాడని ఇంట్లో భార్య, పిల్లలు ఉన్న అతని మృతి విషయాన్ని బయటకు చెప్పలేదని పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మంజునాథ మృతిపై తమకు అనుమానం ఉందని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.