Datta Putrudu : నిజానికి, చాలా కాన్ఫిడెంట్‌గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్ మీద ‘దత్తపుత్రుడు’ అనే సెటైర్ వేశారు. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోయినా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘దత్తపుత్రుడు’ అన్నది జనసేన అధినేతను ఉద్దేశించే.
ప్రజల సాక్షిగా ఒకటికి రెండుసార్లు వైఎస్ జగన్ ‘దత్త పుత్రుడు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
నిజానికి, చాలా గట్టిగా పేలాల్సిన పంచ్ డైలాగ్ ఇది. అయితే, వైఎస్ జగన్ రాంగ్ టైమింగ్‌లో ఈ డైలాగ్ పేల్చి చతికిలపడ్డారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగుతున్న సమయంలో వైఎస్ జగన్ పేల్చిన ‘దత్త పుత్రుడు’ డైలాగ్ వైసీపీ నుంచి గట్టిగా ఎలివేట్ కాలేకపోయింది.
అదే సమయంలో, జనసేన అధినేతకు ఈ వ్యవహారం బాగా కలిసొచ్చింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ సారి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన జనసేనాని, రెండోసారి ఏకంగా ‘సీబీఐ దత్తపుత్రుడు.. చర్లపల్లి జైలు షటిల్ టీమ్..’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు.
మామూలుగా అయితే, వైసీపీ నుంచి మంత్రలు, ఇతర నేతలు పవన్ కళ్యాణ్ మీద ‘దత్తపుత్రుడు’ వ్యవహారంపై చెలరేగిపోవాలి. కానీ, అలా జరగలేదంటే.. దానికి కారణం మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ తాలూకు ప్రకంపనలే. నిజానికి, ఆ ప్రకంపనల తీవ్రతను తగ్గించడానికే టాపిక్ డైవర్షన్ కింద పవన్ కళ్యాణ్ మీద ముఖ్యమంత్రి ‘దత్త పుత్రుడు’ అంటూ సెటర్లు వేసి వుంటే.!
ఏమో, వైఎస్ జగన్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంతుపట్టవు. కానీ, ఒక్కటైతే నిజం.. వైసీపీలో అసంతృప్తి సెగలు అత్యంత వేగంగా చల్లారిపోయాయ్.!
