రవితేజ భారీ సినిమాకి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది.!

మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో బిగ్ హిట్స్ లో తన లాస్ట్ సినిమా “క్రాక్” కూడా ఒకటి. అది ఇచ్చిన బూస్ట్ లో రవితేజ స్టార్ట్ చేసిన సినిమా “ఖిలాడి”. ఇది రవితేజ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ సినిమాగా అంతే కాకుండా భారీ యాక్షన్ థ్రిల్లర్ గా సాలిడ్ లెవెల్లో తెరకెక్కుతుంది. అయితే ఈ ఏడాదిలోనే స్టార్ట్ అయ్యి కేవలం మూడు నెలల వ్యవధిలోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం ఇంకా లేట్ అయ్యింది.

కానీ ఫైనల్ గా ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నామని డేట్ రివీల్ చెయ్యడం జరిగింది. మరి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తుండగా రవితేజ రెండు పాత్రల్లో నటించారు. అలాగే ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అంతే కాకుండా ఈ పెన్ స్టూడియోస్ వాళ్ళే ‘RRR’ సినిమాని హిందీలో భారీ స్థాయి రిలీజ్ కి ప్లాన్ చేశారు.