మొత్తానికి రెండో సినిమాతో “ఖిలాడి” హాట్ బ్యూటీ.!

dimple-hayathi-photos-hd

టాలీవుడ్ లో ఏ హీరోయిన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్పడం ఎవరి వల్ల కాదని చెప్పడంలో సందేహం లేదు. మొదటి సినిమా సెన్సేషనల్ హిట్ అయినప్పటికీ లేదా ఆ సినిమాలో మంచి ఫేమ్ ఆ సినిమాలో హీరోయిన్ కి వచ్చినప్పటికీ రెండో సినిమా ఆఫర్స్ వస్తాయా అనేది ఆశ్చర్యకరమే అని చెప్పాలి.

అలాంటి ఓ హీరోయిన్ కోసమే ఇప్పుడు చెప్పుకునేది. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన రీసెంట్ సినిమాల్లో ప్లాప్ చిత్రం “ఖిలాడి” కూడా ఒకటి. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ హిట్ అవ్వలేదు. కానీ ఈ సినిమాలో పరిచయం అయ్యిన ఇద్దరు హీరోయిన్ లు డింపుల్ హయతి మరియు మీనాక్షి చౌదరి లు ఈ సినిమాలో ఓ రేంజ్ లో గ్లామర్ షో తో అదరగొట్టేసారు.

అయితే వీరిలో మీనాక్షి కి నెక్స్ట్ ఆఫర్స్ వచ్చాయి కానీ డింపుల్ హయతి మాత్రం నెక్స్ట్ అసలు ఎలాంటి తెలుగు సినిమాలో కనిపించలేదు. దీనితో ఇక ఈమెకి అంతే అదృష్టం అనుకున్నారు చాలా మంది. మరి ఇప్పుడు అయితే ఎట్టకేలకి ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ లో రెండో సినిమాలో నటించిందని అప్డేట్ వచ్చింది.

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం “రామ బాణం” లో అయితే ఈమె ఉన్నట్టుగా మేకర్స్ ఇప్పుడు రివీల్ చేశారు. ఈ చిత్రంలో ఈమె భవాని అనే పాత్రలో నటిస్తున్నట్టుగా క్యారెక్టర్ పోస్టర్ ని ఇప్పుడు రివీల్ చేశారు. మరి ఈ సినిమాతో అయినా ఈమె హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.