మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విజయశాంతిని బ్యాన్ చేయడానికి కారణమేంటో మీకు తెలుసా?

ఈతరం ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో మంచి పేరు, గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో విజయశాంతి ఒకరనే సంగతి తెలిసిందే. విజయశాంతి రీఎంట్రీలో నటించిన సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ తర్వాత విజయశాంతికి వరుస ఆఫర్లు వస్తున్నా ఆమె మాత్రం కొత్త సినిమా ఆఫర్లకు ఓకే చెప్పడం లేదు. సినిమల ఎంపిక విషయంలో విజయశాంతి ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

అయితే విజయశాంతిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బ్యాన్ చేసిందనే విషయం చాలామందికి తెలియదు. గతేడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న వివాదాలను అభిమానులు తేలికగా మరిచిపోలేరు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య పోటాపోటీగా ఎన్నికలు జరగగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా మంచు విష్ణు ఎంపికయ్యారు. మా అభివృద్ధి కోసం విష్ణు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మంచు విష్ణు గెలిచిన తర్వాత కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ప్రముఖ నటుడు, లాయర్ అయిన సీవీఎల్ నరసింహారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విజయశాంతిని బ్యాన్ చేసిందని తెలిపారు. తెలంగాణవాదానికి సపోర్ట్ చేయడం వల్లే ఆమెను బ్యాన్ చేశారని ఆయన అన్నారు.

ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో విజయశాంతి సభ్యురాలు కాదని ఆమెను తొక్కేశారని ఆయన చెప్పుకొచ్చారు. పద్మాలయ లాంటి స్టూడియోలకు తెలంగాణలో వాటా ఉందని వాటి గురించి ప్రశ్నించడం కూడా విజయశాంతిని బ్యాన్ చేయడానికి ఒక కారణమని ఆయన తెలిపారు. సీవీఎల్ నరసింహారావు గతంలో చేసిన కామెంట్లు అప్పట్లో నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.