Currency Private Travels : ఏపీలో కరెన్సీ నోట్ల కట్టలు: ఈ కోట్లు ఎవరి కోసం.? ఎందుకోసం.?

Currency Private Travels : ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఐదు కోట్ల రూపాయల మేర నగదు పట్టుబడింది.. ఓ బస్సులో. మరో బస్సులో ఇంతే మొత్తంలో నగదుతోపాటు, బంగారు ఆభరణాలు కూడా బయటపడ్డాయి.

టోల్ గేట్ల వద్ద తనిఖీల్లో ఈ సొమ్ములు, బంగారు ఆభరణాలు బయటపడటం సంచలనంగా మారింది.

ఇదెక్కడి చోద్యం.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో ఉగాది నేపథ్యంలో బంగారు ఆభరణాల కొనుగోళ్ళు ఎక్కువగా వుంటాయి కాబట్టి, ఆ లావాదేవీల్లో భాగంగా ఇలా నగదునీ, ఆభరణాల్నీ ట్రాన్స్‌పోర్టు చేస్తున్నారనే చర్చ తెరపైకొచ్చింది.

లావాదేవీలు నిర్వహించడానికి ఆన్‌లైన్ వేదికలున్నాయి. పెద్ద మొత్తంలో బంగారం తరలించడానికి ప్రత్యేక వాహనాలు, వాటికి భద్రత.. ఇదంతా తతంగం వుండనే వుంటుంది.

కానీ, ఇవేవీ లేకుండా ట్రావెల్స్ బస్సుల్లో కోట్లలో నగదు, కిలోల లెక్కన బంగారు ఆబరణాలు తరలించడమంటే తెరవెనుకాల పెద్ద కథే వుండి వుండాలి.

పెద్ద తలకాయల ప్రమేయం లేకుండా ఇంత ధైర్యంగా ఇలాంటి పనులు జరగనే జరగవ్. ఆ పెద్ద తలకాయలకు రాజకీయ నాయకులతో ఏమన్నా సంబంధాలు వున్నాయా.? అన్నదీ తేలాల్సి వుంది.

ఏమో, అసలు తెరవెనుకాల ఎలాంటి రాజకీయం జరుగుతోందోగానీ..  ఈ కరెన్సీ నోట్ల వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పెద్ద మొత్తంలో నగదు దొరకడం,  ఆ సమయంలో బోల్డన్ని ఊహాగానాలు, రాజకీయ వివాదాలు తెరపైకి రావడం..

ఆ తర్వాత అంతా సైలెంటయిపోవడం మామూలేననుకోండి.. అది వేరే సంగతి.