హద్దులు దాటుతున్న సంచయిత …జగన్ గారు చూస్తున్నారా..?

sanchayita pusapati

 మాన్సాస్ ట్రస్ట్ రాజవంశీకురాలు సంచయిత తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సిరిమానోత్సవం సాక్షిగా సంచయిత వ్యవహరించిన తీరుపై రాజవంశీకులతో పాటుగా విజయనగర ప్రజలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవంలో రోజు కోట బురుజుపై కూర్చునే విషయంలో వివాదం రేగింది.

sanchayita pusapati

  ముందుగా వచ్చిన ఆనంద గజపతిరాజు భార్య సుధ, కుమార్తె ఊర్మిళ కోటపై కూర్చున్నారు. అయితే ఆ ఇద్దరిని కోట నుంచి దింపాలని పోలీసులకు మాన్సాన్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత చెప్పారు. తాము చెప్పలేమని పోలీసులు అనడంతో సంచయిత కోటకు మరోవైపు కుర్చీ వేసుకుని కూర్చొని ఉత్సవాన్ని తిలకించారు. దీన్ని అవమానంగా భావించిన సుధ, ఊర్మిళ ఇద్దరూ కిందికి దిగి వారి బంగ్లాలోకి వెళ్లిపోయారు. రాజ్యం లేకపోయినా, ఏ పార్టీలో వున్నా, విజయనగరం రాజ వంశీకులు అంటే ఆ ప్రాంతంలో అంతో ఇంతో గౌరవం వుంది. కానీ ఇప్పడు ఆ గౌరవం కాస్తా దిగజారిపోయేలా వుంది. ఇక్కడ రాజకీయాలది ఎంత తప్పు వుందో, పూసపాటి వంశానికి చెందిన వ్యక్తిని అని చెబుతూ రాజకీయాలు చేస్తున్న సంచయిత ది కూడా అంతే తప్పు కనిపిస్తోంది.

 సంచయిత తీరుకు నిరసనగా బుధవారం ఆనందగజపతి రాజు రెండవ భార్య సుధ, ఊర్మిళ మౌనం పాటించారు. ఆనందగజపతిరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయనగరం మహారాజకోట బురుజులపై నుంచి సిరిమానోత్సవాన్ని సందర్శించే సంప్రదాయం కొన్ని దశాబ్దాల నుంచి సాగుతుందని దానిని సంచయిత కాలరాస్తోందని వాళ్ళు విమర్శలు.

Sirimahostavam

 అసలు ఎక్కడో ఉండవలసిన పూసపాటి సంచయితను వైసీపీ రాజకీయం చేసి మరి విజయనగరం తీసుకోని వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఆమె ట్రస్ట్ లో వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్న కానీ, ప్రభుత్వ అండదండలు ఉంటడంతో ఎవరు ఆమెని నిలదీయటం లేదు. సంచయిత వెనుక జగన్ అనే బలం ఉందని విజయనగరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సంచయిత వ్యవహరిస్తున్న తీరుకు కూడా జగన్ కారకుడు కావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సంచయిత వ్యవహార శైలి ఇలాగే ఉంటే అది ఖచ్చితంగా జగన్ కు ఇబ్బంది కలిగించే విషయం…కాబట్టి ఆమె విషయాన్నీ సీఎం జగన్ ఒక కంట కనిపెడితే మంచిది