KCR: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది అయితే గత పది సంవత్సరాలుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ మాత్రం కేవలం ఫామ్ హౌస్ మాత్రమే పరిమితమయ్యారు. కేవలం బడ్జెట్ సమావేశాల సమయంలో మాత్రమే అది కూడా తొలిరోజు మాత్రమే ఈయన అసెంబ్లీకి హాజరవుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల కాలంలో కేసీఆర్ కేవలం రెండుసార్లు మాత్రమే అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. కెసిఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన తన అనుభవాన్ని మాతో పంచుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇలా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తాము కూడా అడగాల్సినవి అడుగుతాము అంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికీ కెసిఆర్ మాత్రం అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. ఇలా 15 నెలల కాలంలో రెండు సార్లు మాత్రమే ఈయన అసెంబ్లీలోకి వచ్చినప్పటికీ ఆయనకు మాత్రం ప్రతినెల అందాల్సిన జీతభత్యాలు అందుతున్నాయని ఇటీవల శాసనసభలో రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇదిలా ఉండగా.. 15 నెలల కాలంలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రూ.57,84,124 జీతం తీసుకున్నారని, అయినా రెండుసార్లే అసెంబ్లీకి హాజరయ్యారని తాజాగా సీఎం లెక్కలు బయటపెట్టారు. అసెంబ్లీకి రాకుండా జీతం అందుకోవటంతో ఆయన వేతనాన్ని రికవరీ చేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు సైతం వెళ్లింది. ఈనెల 12వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి అయితే మొదటి రోజు గవర్నర్ ప్రసంగంలో భాగంగా కేసీఆర్ పాల్గొన్నారు తదుపరి రోజు నుంచి ఈయన అసెంబ్లీ లోకి రాలేదు. నేడు, రేపు బీసీ రిజ ర్వేషన్, ఎస్సీ వర్గీకరణపై కీలక చర్చ జరగబోతున్నది. 19న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. వీటికైనా హాజరవుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.