Crime News:పాకిస్థాన్ లో దారుణం.. రోజుకు 11 మంది పై అత్యాచారం..!

Crime News: ప్రస్తుతం ప్రపంచ దేశాలలో అత్యాచార కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో మిగిలిన దేశాలలో పోల్చితే పాకిస్థాన్ లో ఈ అత్యాచార సంస్కృతి ఎక్కువగా ఉంది.పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ లో గత ఆరు నెలల్లో మొత్తం 2,439 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారని హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్(HRPC)తాజా నివేదిక  వెల్లడించింది.HRPC నివేదిక ప్రకారం పాకిస్తాన్లో రోజుకు 11 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. పాకిస్తాన్ లో నేరస్తులను ప్రోత్సహించేలా గా బాధితులను నిందిస్తూ నేరస్థులకు అవసరమైన ప్రయోజనాలను కలిగించటం వల్ల రోజు రోజుకి అత్యాచార కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.

పాకిస్తాన్ లో ముఖ్యంగా బాధితుల పట్ల పురుషులు చాలా హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారని లాహోర్ యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (LUMS) ప్రొఫెసర్ నిదా కిర్మాణి నివేదికలో వెల్లడించారు. పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్న దేశాలలో పాకిస్తాన్ ముందడుగు లో ఉంది. అత్యాచారానికి గురైన మహిళలు ఉండటం వల్ల తమ కుటుంబ పరువు పోతుందని భావించి ఆ కుటుంబానికి చెందిన వారే ఆ మహిళను హత్య చేసిన సందర్భాలు పాకిస్థాన్లో చాలా ఉన్నాయి. ఇటువంటి ఇ సంఘటనలకు ఉదాహరణగా పాకిస్తాన్ లో లో ఇటీవల జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం.

పాకిస్థాన్ లాహోర్ కి200 కిలోమీటర్ల దూరంలో ఉన్న
సర్గోధా జిల్లాలో వారం రోజుల క్రితం ఒక వివాహిత ని నలుగురు వ్యక్తులు కలిసి అత్యాచారం చేశారు. తెలుసుకున్న బాధితురాలి అన్న తన కుటుంబ పరువు తీసిన నెపంతో బాధితురాలిని కాల్చిచంపాడు. ఆ ఆ బాధితురాలికి ఐదుగురు పిల్లలు. ఇలాంటి ఇ దయనీయమైన సంఘటనలు ప్రతిరోజు పాకిస్తాన్ లో జరుగుతూనే ఉంటాయి. బాధితురాలికి న్యాయం న్యాయం జరిగేలా పోరాడాల్సిన కుటుంబ సభ్యులు వారి ప్రాణాలు తీస్తుంటే నేరస్తులు ఇదే అదునుగా రోజు రోజుకి వారి అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్లో బాల్య వివాహాల సమస్య కూడా చాలా తీవ్రమైన సమస్యగా పరిగనించవచ్చు.