క్రేజీ అప్డేట్ : నాగ చైతన్య థ్రిల్లింగ్ ప్రాజెక్ట్ లో వంటలక్క..!

అక్కినేని వారి యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లాస్ట్ మూడు చిత్రాల్లో అయితే థాంక్ యు భారీ డిజాస్టర్ట్ గా మారగా అంతకు ముందు రెండు సినిమాలు బంగార్రాజు, లవ్ స్టోరీ సినిమాలు బాక్సాఫీస్ హిట్ చిత్రాలు అయ్యాయి. అయితే థాంక్ యు లాంటి డిజాస్టర్ తర్వాత నాగ చైతన్య మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉండగా తన నుంచి అయితే మొదటి సారి ఓ ద్వి భాషా చిత్రం చేస్తున్నాడు.

తన కెరీర్ లో 22వ సినిమాగా దర్శకుడు వెంకట్ ప్రభు తో అనౌన్స్ చేసిన థ్రిల్లింగ్ చిత్రం రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ వరుస అప్డేట్స్ ఈరోజు అందించింది. అయితే వీటిలో ఇప్పుడు కేజ్రీగా ఓ అప్డేట్ మారింది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకి గాను స్మాల్ స్క్రీన్ సెన్సేషన్ వంటలక్క ప్రేమి విశ్వనాధ్ నటిస్తున్నట్టు ఇప్పుడు అనౌన్స్ చేశారు.

అయితే ఈ అప్డేట్ మాత్రం మంచి షాకింగ్ అని చెప్పాలి. ఇప్పటి వరకు సినిమాల్లోనే బాగా తెలిసినవాళ్ల పేర్లు అనౌన్స్ చేయడం సాధారణంగానే ఉన్నా ఇప్పుడు ఈమె పేరు కూడా అనౌన్స్ చెయ్యడం ఆడియెన్స్ లో ఒక్కసారిగా ఆసక్తి రేపింది. ఈ దెబ్బతో అయితే లేడీస్ లో నాగ చైతన్య సినిమాకి మరింత క్రేజ్ రావడం అయితే గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో చైతూ సరసన మరోమారు కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.