క్రేజీ న్యూస్ : ‘RRR’ ఫ్యాన్స్ కి సూపర్ పాజిటివ్ న్యూస్ ఇది.!

ఇండియన్ సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టిన భారీ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR). దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తీసిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ వరల్డ్ అపారమైన ఫేమ్ ని ఈ చిత్రం తెచ్చుకుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పుడు మరిన్ని వండర్స్ నమోదు చేస్తూ ఆస్కార్ వరకు వెళ్ళింది. మరి ఈ చిత్రం ని ఇండియా అకాడమీ వారు పంపకపోయినా చిత్ర యూనిట్ ఆస్కార్ కి పలు కేటగిరీ లలో పంపగా ఇప్పుడు ఓ క్రేజీ అండ్ గుడ్ న్యూస్ అయితే బయటకి వచ్చింది. .

మరి మన ఇండియన్ సినిమా ట్రాకర్స్ గుడ్ న్యూస్ ని అందించారు. హాలీవుడ్ రిపోర్ట్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాకి బెస్ట్ ఫిలిం క్యాటగిరీ లో అయితే అవార్డు అందుకునే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనితో అయితే ఈ న్యూస్ సర్వత్రా ఆసక్తిగా మారింది.

మరి నిజంగానే ఈ సినిమాకి ఆస్కార్ వరిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇంకా ఈ భారీ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ లో హీరోయిన్స్ గా నటించగా కీరవాణి సంగీతం అందించారు. అలాగే డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.