బిగ్ బజ్ : ‘అవతార్ 2’ తో “పుష్ప 2” భారీ ఫీస్ట్ పై క్రేజీ న్యూస్.!

గత కొన్ని రోజులు కితమే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించనున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి పుష్ప 2 పై పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గానే స్టార్ట్ కావడానికి రెడీగా ఉంది.

ఇక ఈ చిత్రం ఫోటో షూట్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. అయితే ఈ చిత్రం నుంచి ఇది మాత్రమే కాకుండా సినిమా నుంచి మేకర్స్ అప్పట్లనే ఓ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టు బజ్ వచ్చింది. దీనికి మించి అయితే ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంచనాలు పెట్టుకొని ఎదురు చూస్తున్న చిత్రం అవతార్ 2 తో పుష్ప 2 టీజర్ ని అటాచ్ చేసి రిలీజ్ చేస్తున్నట్టు పలు రూమర్స్ రాగా.

ఇప్పుడు దీనిపై క్రేజీ బజ్ బయటకి వచ్చింది. అవతార్ 2 తో పుష్ప 2 టీజర్ అటాచ్ చేసి రిలీజ్ చెయ్యడం నిజమేనట. మరి ఆల్రెడీ దీనికి ప్లాన్స్ జరుగుతుండగా ఈ డిసెంబర్ 16 న అనేక భాషల్లో అవతార్ 2 తో పుష్ప 2 టీజర్ కూడా అందరికీ కనిపించనుంది అని చెప్పాలి.

అయితే దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మరి సుకుమార్ అయితే ఆల్రెడీ అదిరే రేంజ్ లో ఈ టీజర్ కట్ ని ప్లాన్ చేస్తున్నట్టు కూడా ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇప్పుడు సమాచారం. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణం వహిస్తున్నారు.