చిరంజీవికి నారాయణ క్షమాపణ: భాషా దోషమా.? రాజకీయ పైత్యమా.?

CPI Narayana

సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవికి సీపీఐ నేత నారాయణ క్షమాపణలు చెప్పారు. చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు చెప్పారు. ‘భాషా దోషం’గా తన వ్యాఖ్యల్ని అర్థం చేసుకోవాలంటూ మెగా అభిమానులకూ, కాపు మహానాడుకీ విజ్ఞప్తి చేశారు సీపీఐ నేత నారాయణ.

రాజకీయాల్లో కురువృద్ధుడు అనదగ్గ స్థాయి వున్న వ్యక్తి నారాయణ. వయసు మీద పడుతుండడంతో బహుశా ఆయనకి మెదడు మీద కంట్రోల్ తప్పి వుండొచ్చు. మాట తడబడి వుండొచ్చు. అంతేనా.? మెగా బ్రదర్ నాగబాబు అంటున్నట్లు, అన్నం తినడం మానేసి గడ్డి, చెత్తా చెదారం తినడం వల్ల నారాయణ పరిస్థితి ఇలా తయారైందా.?

కారణం ఏదైతేనేం, మెగా అబిమానుల ఆగ్రహానికి దిగొచ్చారు నారాయణ. జరిగిన డ్యామేజీ నేపథ్యంలో క్షమాపణ చెప్పక తప్పలేదు. అయితే, ‘భాషా దోషంగా పరిగణించాలి’ అనడమేంటి.? బేషరతుగా చిరంజీవికి నారాయణ క్షమాపణ చెప్పి వుంటే, ఆయనకే అది హుందాతనంగా వుండి వుండేది.

రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చుగాక. అలాగని నారాయణ సమర్థించుకున్నా సరే, రాజకీయాల్లో సంయమనం అవసరం. నోటికొచ్చినట్లు వాగితే అది రాజకీయం అవదు, ‘రంకు’ అవుతుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

కమ్యూనిస్టులంటే నిబద్ధతకు మారు పేరు. అలాంటి కమ్యూనిస్టు పార్టీలో కీలక నేతగా వుండి, నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎలా.?