TG: దిల్ రాజు వ్యాఖ్యలను సమర్థిస్తున్న సీపీఐ నారాయణ… కరెక్ట్ గానే చెప్పారంటూ?

TG: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మొదటిసారి తన అధికారిక సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా కేటీఆర్ పై విమర్శలు చేశారు. గత కొంతకాలంగా కేటీఆర్ తన రాజకీయ స్వప్రయోజనాల కోసం సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే అల్లు అర్జున్ పై కక్ష సాధింపుగానే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తన పేరు మర్చిపోయినందుకే తనని అరెస్టు చేశారు అంటూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలా కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. పేరు మర్చిపోయినందుకే తనని అరెస్టు చేయించానని మాట్లాడుతున్నారు నా స్థాయి అది కాదు ఇలాంటి వార్తలు వస్తున్నప్పుడు ఖండించాల్సిన బాధ్యత టాలీవుడ్ ఇండస్ట్రీదే కదా అంటూ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో దిల్ రాజు రంగంలోకి దిగారు. ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం సినిమా ఇండస్ట్రీని మధ్యలోకి లాగొద్దని తెలిపారు.

సినిమా ఇండస్ట్రీని రాజకీయ విమర్శల కోసం అసలు ఉపయోగించొద్దని ఈయన తెలిపారు. అయితే దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ స్పందించారు. ప్రభుత్వానికి, సినిమా రంగానికి విభేదాలు అవసరం లేదు. దిల్ రాజు ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాను. దిల్ రాజు గారు ఈ విషయాన్ని చెప్పారు అంటూ నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.