Covid Pandemic : కోవిడ్ పాండమిక్: మెడికల్ మాఫియా కోసమే ‘వైరస్’ పుట్టిందా.?

Covid Pandemic : డౌటేముంది.? కేవలం మెడికల్ మాఫియా కోసమే కోవిడ్ వైరస్ పుట్టి వుండాలి. లేకపోతే, అన్ని రంగాలూ కోవిడ్ దెబ్బకు విలవిల్లాడుతోంటే, మెడికల్ మాఫియా మాత్రం సంపాదించిన డబ్బుని ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంతగా ఆందోళన చెందుతోంది. అంతలా మెడికల్ మాఫియా ‘వెరైటీ’ పండగ చేసుకుంటోంది.

సాధారణ జ్వరానికి వాడే పారాసిటమాల్ ట్యాబ్లెట్లనుంచి రెమిడిసివిర్ వంటి ఖరీదైన మందుల వరకు.. విపరీతమైన డిమాండ్ గడచిన రెండేళ్ళలో కనిపిస్తోంది. ముందు ముందు కూడా వీటికి డిమాండ్ పెరగబోతోంది. కోవిడ్ వైరస్ చాలామందిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కొందర్ని మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది.

అప్పటికీ, ఇప్పటికీ అదే పరిస్థితి. వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కోవిడ్ వచ్చే అవకాశాలున్నాయి. అయితే, స్వల్ప లక్షణాలు మాత్రమే వుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో ‘మెడికల్ కిట్లు’ ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్నాయి. వీటిల్లో ఎన్ని మందులు ఖచ్చితంగా అవసరం.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి.

రెమిడిసివిర్ మెడిసిన్ విషయంలో సెకెండ్ వేవ్ సందర్భంగా నడిచిన దందా అంతా ఇంతా కాదు. ఇప్పుడు మళ్ళీ రెమిడిసివిర్ దందా షురూ అవుతోంది. ఇప్పటివరకూ అయితే కొత్తగా ‘బ్లాక్ మార్కెట్లో’ రెమిడిసివిర్.. అన్న ప్రచారం జరగడంలేదుగానీ, ముందు ముందు తప్పకపోవచ్చు.

రెండో వేవ్‌తో పోల్చి చూస్తే, మూడే వేవ్ వల్ల ఆసుపత్రుల్లో చేరికలు తక్కువగానే వున్నాయన్నది వైద్య నిపుణుల మాట. అయినాగానీ, కేసుల తీవ్రత.. సంఖ్యా పరంగా చాలా ఎక్కువగా వుంటోంది గనుక.. ముందు ముందు ఆసుపత్రి చేరికలూ పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఈలోగా మెడికల్ మాఫియా మళ్ళీ పండగ చేసేసుకుంటోంది.