Remidisvir: రెమిడిసివిర్ చుట్టూ కోవిడ్ మాఫియా: నిజాలేంటి.? అపోహలేంటి.?

Covid Mafia: Remidisvir truths and myths
Remidisvir: రెమిడిసివిర్.. ఈ మెడిసిన్ చుట్టూ దేశవ్యాప్తంగా జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. వెయ్యి నుంచి మూడు వేల రూపాయల ధర పలుకుతుంది ఈ మెడిసిన్. వివిధ కంపెనీలు ఈ మెడిసిన్ అందిస్తున్నాయి. వెయ్యి రూపాయల్లో కూడా రెమిడిసివిర్ దొరుకుతుందంటూ కేంద్రం ఇటీవల ప్రకటించింది. కానీ, మార్కెట్లో ఒక్కో రెమిడిసివిర్ ఇంజెక్షన్ 25 వేల నుంచి 60 వేల రూపాయల ధర పలుకుతోందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.
 
Covid Mafia: Remidisvir truths and myths
Covid Mafia: Remidisvir truths and myths
రెమిడిసివిర్ ప్రాణాధార మెడిసిన్ కానే కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆసుపత్రుల్లో చేరి, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్నవారికి రెమిడిసివిర్ అవసరమవుతుందనీ, అదీ అతి తక్కువ సందర్భాల్లోనేననీ, వైద్యులు నెత్తీ నోరూ బాదుకుంటున్నా, రెమిడిసివిర్ చుట్టూ రచ్చ మాత్రం కొనసాగుతూనే వుంది. ‘మాకు రెమిడిసివిర్ ఇస్తారా.? ఇవ్వరా.?’ అటూ రోగులు నిలదీస్తున్నారన్నది కొందరు వైద్యుల వాదన. నిజమా.? ఆ పరిస్థితి వుటుందా.? అన్నది అసలు సిసలు అంశం. నిజానికి, రోగి ప్రాణాల కోసం రోగి బంధువులు వాపోతుంటారు.
 
ఏ మందులు వాడాలో రోగుల బంధువులకు తెలిస్తే, ఆసుపత్రులకు ఎందుకు వెళతారు.? వైద్యులే, రోగులకు రెమిడిసివిర్ సిఫార్సు చేస్తున్నారు. ఆ వైద్యులే, తెరవెనుకాల బ్లాక్ మార్కెట్ నుంచి మందుల్ని విక్రయిస్తున్నారు. ఇది చాలా కేసుల్లో బయటపడ్డ వాస్తవం. ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నది కొద్దిమంది డాక్టర్లు మాత్రమే. కానీ, మొత్తం వైద్య వ్యస్థకు రెమిడిసివిర్ మకిలి అంటుకుంటోంది. సీనియర్ వైద్యులు గురవారెడ్డి, శుభాకర్ తదితరులు రెమిడిసివిర్ విషయంలో అనవసర రాద్ధాంతం జరుగుతోందని చెబుతున్నారు. ఈ రచ్చ తగ్గితే తప్ప, రెమిడిసివిర్ అక్రమ అమ్మకాలు తగ్గవన్నది వారి వాదన. రెమిడిసివిర్ మాత్రమే కాదు, వెంటిలేటర్ మీద రోగి వున్నప్పుడు వాడే మరో ఇంజెక్షన్ ధర ఏకంగా 30 వేల నుంచి నాలుగున్నర లక్షలకు వెళ్ళిపోయింది. ఇదీ కరోనా మాఫియా తీరు.