Covid 4th Wave : సినిమాని భయపెడుతున్న కోవిడ్ నాలుగో వేవ్..!

Covid 4th Wave : ఢిల్లీలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయ్. కొన్ని చోట్ల లాక్‌డౌన్లు సైతం స్టార్ట్ అయ్యాయ్. నాలుగో వేవ్ ముప్పు మళ్లీ ఎదుర్కోక తప్పదంటూ కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు కూడా. అయితే, మూడో వేవ్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. అది కాస్త ఊరట అని చెప్పాలి.
కానీ, ఏమో చెప్పలేం. కోవిడ్ మహమ్మారి ఎప్పుడు, ఎలా, విరచుకుపడుతుందో తెలీదు. ఆల్రెడీ ఆ పెయిన్ అనుభవించేశాం కాబట్టి, మళ్లీ సినీ ఇండస్ర్టీని ఈ భయం వెంటాడుతోంది. కోవిడ్ మళ్లీ విజృంభిష్తే, మొదటగా దెబ్బ పడేది సినీ ఇండస్ర్టీ పైనే. ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’, తదితర పెద్ద సినిమాలు ఎప్పుడో రిలీజ్ కావల్సింది. కానీ, కోవిడ్ కారణంగా ఆలస్యమైపోయాయ్.
చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. చాలా సినిమాల విషయంలో ఈ ఆలస్యం కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. సినిమా ఆలస్యం కేవలం ఆర్ధికంగా నష్టం మిగల్చడమే కాదు, సినిమా ఫలితం పైనా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు.
ఇక, ఇప్పుడు.. కోవిడ్ నుంచి కాస్త ఉపశమనం పొందామనే చెప్పాలి. దాంతో కోట్లలో బడ్జెట్ పెట్టి కొత్త కొత్త సినిమాలు రూపొందుతున్నాయ్. ఇప్పుడిప్పుడే బాక్సాఫీస్  కళకళలాడుతోంది.
చచ్చిపోయిందనుకున్న సినిమా కాస్త ఊపిరి పోసుకుంటోంది. ఈ తరుణంలో కోవిడ్ నాలుగో వేవ్ అంటే.. ఊహించడానికే కష్టంగా వుంది. మూడో వేవ్ మాదిరి నాలుగో వేవ్ కూడా వచ్చినట్లే వచ్చి పోతే ఫర్వాలేదు కానీ, ఎలాంటి ఇంపాక్ట్ చూపించినా సినిమా పరిస్థితి ఏ తీరుగ మారునో చెప్పలేం.