Covid 19 Vaccine : కోవిడ్ 19 వ్యాక్సిన్.. మొత్తం ఎన్ని డోసులు తీసుకోవాలంటే.?

Covid 19 Vaccine :  భారత దేశానికి సంబంధించినంతవరకు ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సినేషన్ విషయమై మూడో డోస్ రన్నింగ్‌లో వుంది. అది కూడా ఎంపిక చేసిన గ్రూపు వారికి మాత్రమే. అనగా, ఫ్రంట్ లైన్ వారియర్స్, 60 ఏళ్ళ పైబడి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి మూడో డోస్ ఇస్తున్నారు.

అతి త్వరలో మిగతా వారికి కూడా మూడో డోస్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇంతకీ, మూడో డోసుతో వ్యవహార ముగిసిపోతుందా.? ఆ తర్వాత ఇంకో డోస్ అవసరం వుండదా.? బూస్టర్ డోసుతోనే పూర్తి స్థాయిలో వ్యాధి నిరోధక శక్తి మనకి వచ్చేస్తుందా.? అంటే, ‘నో’ అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు వైద్య నిపుణులు.

బహిరంగ మార్కెట్లోకి వ్యాక్సిన్లను విడుదల చేయడమంటే, ఇకపై అవసరాన్ని బట్టి ఎవరైనా ఆయా వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు బూస్టర్ డోసులుగా వేసుకోవచ్చనే కదా.? అమెరికా లాంటి దేశాల్లో మూడో డోస్ పూర్తయిపోయి, నాలుగో డోస్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో ఐదో డోసు కూడా పూర్తయిపోయింది.

కోవిడ్ 19 వైరస్ ఎప్పటికీ ఈ భూమ్మీద నుంచి మాయమయ్యేలా కనిపించడంలేదు. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు వస్తూనే వుంటాయ్.. డెల్టా, ఒమిక్రాన్ తరహాలో. ఇదైతే క్లియర్. సో, కొత్త వేరియంట్ వస్తోందనగానే, బూస్టర్ డోస్ పొడిపించేసుకోవాలన్నమాట.

అసలు కోవిడ్ 19 వ్యాక్సిన్ల సమర్థత ఎంత.? అన్నదానిపైనే బిన్నాభిప్రాయాలు వున్న నేపథ్యంలో ఈ బూస్టర్ డోసుల గోలేంటి.? అనేది మరికొందరి మాట. ఎవరి గోల వారిదే.. వ్యాక్సిన్ వేసుకోకపోతే చచ్చిపోతామన్న భయంతో.. వ్యాక్సిన్లు వేసుకోకుండా ఎవరూ వుండలేకపోతున్నారు.