Covid 19: కోవిడ్ 19 వ్యాక్సిన్.. సంవత్సరానికి నాలుగు డోసులేసుకుంటే.!

Covid 19 : అసలేంటీ కరోనా వైరస్.? ఇప్పటిదాకా ఈ వైరస్ గురించిన సంపూర్ణ సమాచారం వైద్య నిపుణుల దగ్గర వుందా.? లేదా.? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు.? ఇలా చాలా ప్రశ్నలున్నాయి. వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా వైరస్ నుంచి ప్రమాదం లేనట్టేనని వైద్యులు, ప్రభుత్వాలు చెబుతున్నా.. ఎంతవరకు ఈ వ్యాక్సిన్లతో కరోనా వైరస్ నుంచి సురక్షితంగా వుండొచ్చన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం దొరకడంలేదు.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో మూడు నెలలకే యాంటీబాడీస్ తగ్గుతున్నాయంటూ తాజాగా ఓ ప్రచారం తెరపైకొచ్చింది. ఉత్త ప్రచారం కాదు.. ఓ సర్వే ఫలితమిది. ఆ లెక్కన ఏడాదిలో నాలుగు సార్లు వ్యాక్సిన్ డోసులు తీసుకోవాలేమో.. అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

ప్రస్తుతానికైతే రెండు డోసులు.. ఇటీవలే మూడో డోస్ గురించిన ప్రచారం కూడా జోరందుకుంది. చాలా దేశాల్లో మూడో డోసు వ్యాక్సిన్.. బూస్టర్ డోసుగా అందించడం మొదలు పెట్టేశారు.

చాలా దేశాల్లో సీజనల్ ఫ్లూ బారిన పడకుండా వుండేందుకు ఎప్పటికప్పుడు ఫ్లూ వ్యాక్సిన్లను వేసుకుంటుంటారు. కోవిడ్ విషయంలో కూడా అదే పరిస్థితి రాబోతోందేమో. అసలు, కోవిడ్ 19 అనే వైరస్ పుట్టిందే వ్యాక్సిన్ తయారీ సంస్థలకు మేలు చేయడానికేమో.?

ఒక దేశం కాదు, ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకి విలవిల్లాడుతోంది. కోవిడ్ 19 పుట్టిల్లుగా చెప్పబడుతున్న చైనా తప్ప, ప్రపంచంలో అన్ని దేశాలూ కరోనా వైరస్ వల్ల తీవ్రంగా బాధింపబడుతున్న దేశాలే. ఇంతలా ప్రపంచం మీద చైనా పెద్ద బాంబుని కరోనా వైరస్ రూపంలో ప్రయోగించిందని అనుకోవాలేమో.

మొత్తమ్మీద, ఏడాదికి మూడో నాలుగో డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ముందు ముందు తేలితే, జనం జేబులకు చిల్లు.. అలాగే, ప్రజారోగ్యం గుబిల్లు.. అంతే మరి.!