కృష్ణపట్నం మెడిసిన్: కరోనా కోరలు వంచేస్తుందా.?

Covid 19 Medicine from Krishnapatnam, AP, Is It True?

anandhaya ayurvedic medicine

రపంచం సాంకేతికంగా ఎంత పురోగతి సాధిస్తున్నా, అనేక సవాళ్ళు ఎప్పటికప్పుడు మనిషి మేధస్సుని సవాల్ చేస్తూనే వున్నాయి. ఆకాశపుటంచుల్ని తాకేస్తున్నాం.. సముద్రపు లోతుల్ని చూసేస్తున్నాం.. కానీ, మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నాం.. అంటాడో కవి. మనసు సంగతి పక్కన పెడితే, మనం.. మన ప్రకృతిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ ప్రకృతికి మనం ఏమిస్తే, అట్నుంచి మనకి అదే లభిస్తుంది. ఓ సినిమాలో హీరో చెబుతాడు.. భూమికి మనం ఏమిస్తామో, ఆ భూమి నుంచి మనకి అదే వస్తుందని. భూమిలోకి విషాన్ని ఎరువుల రూపంలోనో, పురుగు మందుల రూపంలోనో పంపితే.. అట్నుంచి మనకి వచ్చేది కూడా అదే. కరోనా వైరస్ విషయంలో కూడా అదే నిజమని అనుకోవాలేమో. ఏడాదిన్నర పూర్తయ్యింది కరోనా వైరస్.. ప్రపంచానికి పరిచయమై. ఇప్పటికీ, సరైన మందు కనుక్కోలేకపోయాం. మనిషి మేధస్సు ఏమయిపోయింది.? కోట్లాది మంది మేధావులకే అర్థం కాని ప్రశ్న ఇది.

ఇదిగో, ఓ ఆయుర్వేద మందు.. కరోనా వైరస్ బారిన పడ్డవారికి ఉపశమనం కలిగిస్తుంది.. కరోనా వైరస్ రాకుండా చేస్తుంది.. అంటూ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని కృష్నపట్నం అనే ఓ గ్రామం నుంచి తీపి కబురు అందుతోంది. ఈ మందు నిజంగానే పనిచేస్తోందా.? లేదా.? అన్నది శాస్త్రీయంగా తేలాల్సి వుంది. కానీ, ఇంట్లో నిత్యం వాడే చాలా దినుసులే.. అంటే మన పోపుల పెట్టెలోనే కరోనా నుంచి ఉపశమనం కలిగించే ఔషధాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇమ్యూనిటీ.. ఇదే అన్ని రోగాలకీ నిఖార్సయిన సమాధానం. దాన్ని చెడగొట్టుకుంటున్నదెవరు.? ఇంకెవరు మనమే. బియ్యం దగ్గర్నుంచి వంట నూనెల వరకూ అన్నీ కల్తీనే. అందుకే ఇమ్యూనిటీ సర్వనాశనమైపోతోంది. ఈ తరుణంలో సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు లేని ఓ ఔషధం, మన తెలుగు నేల నుంచి కరోనా వైరస్ మీద అస్త్రంలా పనిచేస్తే.. అంతకన్నా కావాల్సిందేముంది.?