ఏపీ బీజీపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనాయరణ తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా నిత్యం ప్రభుత్వం పై ఏదో విమర్శ చేస్తూనే ఉంటారు. అయినదానికి కానిదానికి ఆయనగారు చేసే విమర్శలు ఏపీ ప్రజలకి…ప్రభుత్వానికి ఓ అలవాటుగా మారిపోయింది. ఇటీవలే జగన్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగాను కన్నా పాత పాటే పాడారు. పోతిరెడ్డిపాడు వివాదాస్పద ప్రాజెక్ట్ మినహా జగన్ చేపట్టిన అన్ని సంక్షేమ కార్యకలాపాలపై కన్నా వైఖరి ఒకేలా ఉంది. ఆర్ ఎస్ ఎస్ పేరు చెప్పుకుని ఆయనగారు ఇక్కడ చేసిందేమి లేదు గానీ! ఆ ట్యాగ్ ను మాత్రం వాడుకోవడంలో తలపండిన నాయకుడని చెప్పొచ్చు.
ఇలాంటి నాయకుల వల్ల బీజేపీకి ఏపిలో ఉన్న పరువు కూడా బజారున పడుతోందని ఇప్పటికే వైకాపా నేతలు విమర్శించారు. తాజాగా జగన్ ఏడాది పాలను ఉద్దేశిస్తూ బీజేపీ అధిష్టానం ప్రశంసల జల్లు కురిపించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సీఎం పాలనను ఓ స్వర్ణ యుగముగా వర్ణించారు. రాష్ర్టంలో జగన్…కేంద్రలో మోదీ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా రెండు ప్రభుత్వాల పనితీరును ఆకాశానికి ఎత్తేసారు. జగన్ -మోదీ మధ్య మంచి సత్ససంబంధాలు కొనసాగుతున్నాయని, ఇద్దరు ప్రజలకు కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకులన్నారు. ఏపీ కోసం జగన్ ధృడసంకల్పంతో ముందుకెళ్తున్నారన్నారు.
జగన్ చేపట్టిన ప్రతీ సంక్షేమ పధకాన్ని కేంద్రం చాలా దగ్గరగా పరిశీలిస్తుందని..ఆ విషయలో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా జగన్ సర్కార్ నిలుస్తుందన్నారు. కేంద్రం నుంచి ఏపీకి చేయాల్సినది అంతా చేస్తామని ధీమా వ్యక్తం చేసారు. దీంతో ఏపీ బీజేపీ అద్యక్షుడు సహా మిగతా నేతలు ఖంగుతున్నారు. రాష్ర్ట నాయకులు ఒకలా అంటే….రాంమాధవ్ మరోలా వ్యాఖ్యానించడంతో కన్నాకి కౌంటర్ లా పడినట్లు అయింది. మరి రాంమాధవ్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ స్పందిస్తుందా? లేక లోలోపల మధనపడి మర్చిపోతారా? అన్నది చూడాలి. జగన్ ఏడాది పాలనపై అదిష్టానం నుంచి దక్కిన ఈ ప్రశంసల్ని ఓ గిప్ట్ అయితే అనుకోవచ్చు.