దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు.. కొత్తగా 1,259 కరోనా కేసులు!

దేశంలో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,259 మందికి వైరస్​ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కోవిడ్ మరో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,705 మంది వైరస్‌​నుండి కోలుకున్నారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ కూడా వేగంగా కోనసాగుతుంది. సోమవారం మరో 25,92,407 డోసులు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 1,83,53,90,499కు చేరింది.