ఇండియా ఫార్మా దిగ్గజం గ్లెన్ మార్క్ కరోనాని కట్టడి చేసే మాత్రలను తయారు చేసిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం ఈ విషయాన్ని గ్లెన్ ఫార్మా ప్రకటించింది. యాంటి వైరల్ డ్రగ్ ఫవిపిరవిర్ ను ప్యాబిప్లూ పేరుతో మాత్రను ఆవిష్కరించింది. భారత ఔషద నియంత్రణ సంస్థ (డీసీజీఐ) నుంచి కూడా అనుమతులు వచ్చేసాయి. కోవిడ్ చికిత్సలో భాగంగా మాత్రల తయారీకి అనుమతి పొందిన తొలి సంస్థ గ్లెన్ మార్క్ చరిత్రకు ఎక్కింది. కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న వారికి ఈ మాత్రల ద్వారా నయం అయిపోతుందని సంస్థ ప్రకటించింది. అయితే కోవిడ్ వైరస్ ముదిరితే మాత్రం మాత్రలు పనిచేయవు అన్న విషయాన్ని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో తాజాగా కరోనాకి ఇంజెక్షన్ కూడా వచ్చేసినట్లు కొద్ది సేపటి క్రితమే హెటిరో ఫార్మా ప్రకటించింది. కరోనాకి మందు సిద్దం చేసామని జెనిరిక్ ఫార్మాస్యూటికల్ ప్రకటించింది. రెమ్డిసివిర్ అనే పేరుతో తయారు చేసినా కోవిఫర అనే పేరుతో మార్కెట్ లో కి తీసుకొస్తున్నారు. 100 మిల్లీగ్రాముల వయల్ (ఇంజెక్షన్) రపంలో ఉంటుందని హెటిరో గ్రూప్ ఆఫ్ కంపనీస్ చైర్మన్ పార్థసారథి రెడ్డి తెలిపారు. ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం డీసీజీఐ అనుమతి కూడా పొందినట్లు తెలిపారు. కోవిడ్ కి డ్రగ్ వచ్చిన 24 గంటల్లో ఇంజెక్షన్ రూపంలో హెటిరో మందు తీసుకురావడం సంచలనంగా మారింది. అయితే ప్రపంచ దేశాలు ఔషదాన్ని కనుకోనడానికి రేయింబవళ్లు శ్రమిస్తున్నా..సాధ్యం కానిది భారత్ కు సాధ్యం అవ్వడం విశేషం.
అన్నట్లు హెటిరో డ్రగ్స్ కంపెనీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సంబంధించనది కావడం విశేషం. ప్రస్తుతం భారత్ లో కరోనా ఉగ్ర రూపం దాల్చుతోన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సడలిపులు ఇవ్వడంతో కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. డెత్ రేట్ కూడా పెరుగుతోంది. దీంతో ఈ విపత్తుని ఎలా ఎదుర్కోవాలని ప్రధాని సహా అన్ని రాష్ర్టాల సీఎంల తలలు పట్టుకుంటున్నారు. ఇంతలో మాత్ర, ఇంజెక్షన్ రూపంలో కరోనాకి విరుగుడు దొరకడం విశేషం.