దేశ ప్రజలకు ‘ఫ్రీ’గా కరోనా వ్యాక్సిన్ : కేంద్రమంత్రి హర్షవర్ధన్

china released corona vaccine last month

భారతదేశంలో దాదాపుగా 259 ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ డ్రైరన్ ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం తొలి దశలో భాగంగా డాక్టర్లు, నర్సులు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు, 50 ఏళ్లు పైబడినవారికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్‌ వేయనున్నారు.

రెండో దశలో కోవిడ్ యాప్ ద్వారా సాధారణ ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో జరుగుతున్న డ్రైరన్‌ను కేంద్రమంత్రి హర్షవర్ధన్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. వ్యాక్సిన్‌ పై ఎలాంటి అపోహలు వద్దని అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్లపై నిపుణుల బృందం పర్యవేక్షిస్తుందని, కరోనా వ్యాక్సిన్‌ త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ దేశమంతా ఉచితంగానే అందిస్తామని ప్రకటించారు. దిల్లీలో పలు ప్రదేశాల్లో వ్యాక్సిన్ డ్రైరన్ జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించిన తర్వాత అయన ఈ ప్రకటన చేశారు. దిల్లీలోనే కాదు దేశమంతా ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వనున్నాం అని తెలిపారు. కోవిషిల్డ్ అత్యవసర వినియోగం పై డిసిజిఐ నిర్ణయం తీసుకుంటుంది అని తెలిపారు.