సిత్రాలు చూపిస్తోన్న కరోనా!

ఇప్పటి వరకు ఆన్‌లైన్లో జరిగే ఎంగేజ్‌మెంట్స్, పెళ్లిళ్లు చూసి ఉంటారు.. కరోనా పుణ్యమా అని ఇప్పుడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పక్కపక్కన లేకుండానే పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి.

ఇది కేర‌ళ‌లో జరిగిన వింత. ఓ జంట ఆదివారం ఫోన్‌లోనే పెళ్లి చేసేసుకుంది. పెళ్లి కొడుకు అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లగా.. ఎక్కడో ఉన్న అమ్మాయికి వాళ్ల అమ్మే తాళి కట్టేసింది.

ఏంటీ విడ్డూరం అంటే.. కేరళకు చెందిన బ్యాంకు ఉద్యోగి శ్రీజిత్‌‌, అల‌ప్పుజాలో‌కు చెందిన అమ్మాయికి ఆదివారం 12 గంట‌ల‌కు పెళ్లి నిశ్చయించారు పెద్దరు. అనుకున్న ముహార్తానికి వ‌ధూవ‌రులిద్ద‌రూ ముస్తాబై ఫోన్‌లో లైవ్‌లో ఎదురెదురు నిలబడ్డారు. వ‌రుడు ఫోన్‌కు వెన‌క‌వైపున తాళి కట్టేశాడు.

లాక్ డౌన్ కారణంగా లక్నోలో ఇరుక్కుపోయిన వధువుకు ఆమె తల్లే మూడు ముళ్లు వేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ అంతా అవాక్కయిపోతున్నారు.

 

 

For more Telugu News: www.Telugurajyam.com