ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కరోనా. దీని వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. కరోనా మొదటి వేవ్ పోయిందో లేదో సెకండ్ వేవ్ అంటూ మళ్లీ విరుచుకుపడుతోంది. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయింది. దీంతో వెంటనే భారత్ కూడా అప్రమత్తమయింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ వెంటనే అలర్ట్ ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఈనేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఓ రికార్డు క్రియేట్ చేసింది. కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం రికార్డును సృష్టించింది. ఏపీలో ఇప్పటి వరకు కరోనా శాంపిల్స్ టెస్టులు కోటి దాటాయి. ఇప్పటి వరకు 1,00,17,126 మందికి కరోనా టెస్ట్ చేసినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.