ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిరోజు ఐదు వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఏపీ వ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో 53,681 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 7,813 కేసులు నమోదయ్యాయి. అలాగే ఒక్కరోజులోనే 52 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 88,671కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
గోదావరి జిల్లాల్లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1324 కరోనా కేసులు నమోదవగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 1012 కేసులు నమోదయ్యాయి. ఇక ఆ తర్వాత విశాఖలో 936, కర్నూలులో 742, అనంతపురంలో 723, గుంటూరులో 656, విజయనగరంలో 523, కృష్ణాలో 407, శ్రీకాకుళంలో 349, చిత్తూరులో 300, నెల్లూరులో 299, కడపలో 292, ప్రకాశంలో 248 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 985 మంది మరణించగా, 43,255 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం ఏపీలో 44,431 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.