Home News వామ్మో : ఆ మహిళకు 31 సార్లు కరోనా పాజిటివ్‌

వామ్మో : ఆ మహిళకు 31 సార్లు కరోనా పాజిటివ్‌

కరోనా ప్రపంచతోపాటు భారతదేశంలోనూ అలజడి సృష్టిస్తుంది. దీనికి సంబంధించిన విషయాలు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ మహిళకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 సార్లు కరోనా సోకిందట. పరీక్ష చేసుకున్నా ప్రతిసారి ఆమెకు పాజిటివ్‌ అనే వస్తోంది. దీన్ని చూసి వైద్యులే నివ్వెరపోయారు. లక్షణాలే లేకున్నా ఆమె పాజిటివ్‌ వస్తోంది.

Corona Positive | Telugu Rajyam

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. రాజస్థాన్ ‌లోని అప్నాఘర్‌ ఆశ్రమానికి చెందిన శారదకు కరోనా లక్షణాలు ఏమీ లేవు. అయినా కూడా ఆమెకు కేవలం ఐదు నెలల్లోనే 31 సార్లు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆమెను భరత్‌పూర్‌ జిల్లాలోని ఆర్‌బీఎం ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. గతేడాది ఆగస్టు 20వ తేదీన ఆమెకు తొలిసారి కరోనా పరీక్ష చేయగా కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యుడు భరద్వాజ్‌ తెలిపాడు.

అలా ఇప్పటివరకు శారదకు 31 సార్లు కరోనా పరీక్షలు చేయగా.. ప్రతిసారి పాజిటివ్‌ వచ్చిందని వివరించారు. ప్రారంభంలో ఆమె అస్సలు నిల్చోడానికి కూడా సాధ్యమయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. గతంలో ఆమె అల్లోపతి, ఆయుర్వేద, హోమియోపతి వైద్యం చేయించుకున్నారు. ఇంకా ఆశ్చర్యంగా ఆమె 7-8 కిలోల బరువు పెరగడం గమనార్హం. తొలిసారి వచ్చిన వైరస్‌ చికిత్స తీసుకున్నా శరీరంలో ఉంటుందని.. అందువల్లే ఆమెకు తరచూ పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Posts

కొడాలి నానికి బాలయ్య అంటే అంత భయమా.?

మంత్రి కొడాలి నాని, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణ(బాలయ్య) మీద విమర్శలు చేసే క్రమంలో కొంత సంయమనం పాటిస్తుంటారు. ఎందుకు.? అంటే, దానికి చాలా కారణాలుంటాయనే చర్చ గుడివాడ నియోజకవర్గంలో తరచూ జరుగుతుంటుంది....

టీడీపీ కప్పులో తుపాను: తిట్టుకుంటారు, వీలైతే కొట్టుకుంటారు.!

టీ కప్పులో తుపానులా బెజవాడ తెలుగు తమ్ముళ్ళ మధ్య గొడవ చాలా తక్కువ సమయంలోనే చల్లారిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దారు. లేకపోతే, బుద్ధా వెంకన్న.. మాటకు కట్టుబడి...

టీడీపీ పతనానికి తనవంతు సాయం చేస్తున్న బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీ పతనం అంచున కొట్టుమిట్టాడుతోంది చాలాకాలంగా. 'పార్టీ బాధ్యతల్ని మా బాలయ్యకు అప్పగించెయ్యండహో..' అంటూ నందమూరి వంశ వీరాభిమానులైన కొందరు టీడీపీ నేతలు ఎప్పటినుంచో నినదిస్తున్నారు. 'ఇంకా నయ్యం.. బాలయ్యకు పార్టీని...

Latest News