పెళ్లై నెల తిరగకుండానే అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పబోతున్న హన్సిక!

చిత్ర పరిశ్రమలో యాపిల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్నటువంటి హన్సిక తెలుగు ఇండస్ట్రీకి దేశముదురు సినిమా ద్వారా పరిచయమయ్యారు. అనంతరం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటించిన హన్సిక ఈ నెల నాలుగవ తేదీ తన ప్రేమించిన వ్యక్తి సోహైల్ కతురియా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇలా సోహైల్ కి ఇది రెండవ వివాహం కావడం గమనార్హం.

సోహైల్ ఇదివరకే హన్సిక స్నేహితురాలిని వివాహం చేసుకొని ఆమెతో విడాకులు తీసుకున్నారు. అయితే వీరి వివాహానికి హన్సిక కూడా వెళ్లి పెద్ద ఎత్తున రచ్చ చేశారు. అయితే తన ఫ్రెండ్ నుంచి విడాకులు తీసుకున్నటువంటి ఈయనతో హన్సిక బిజినెస్ పార్ట్నర్ గా పలు వ్యాపారాలను నిర్వహిస్తూ వచ్చారు. ఇలా బిజినెస్ పార్టనర్ అయినటువంటి తనతో ప్రేమలో పడిన హన్సిక చివరికి తననే వివాహం చేసుకున్నారు..

వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ రాజస్థాన్ జైపూర్ ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.అయితే ఈమె పెళ్లి జరిగిన రోజులు కూడా కాకుండానే అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నారు.షాకింగ్ న్యూస్ అంటే ఈమె కొంపదీసే నెల తప్పిందనే విషయం కాదండోయ్ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి తన భర్తకు తన పూర్తి సహకారాన్ని అందిస్తూ వ్యాపార రంగంలోనే స్థిరపడాలని భావించారట. ఇలా హన్సిక సినిమాలకు దూరమవుతున్నారని తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.