ప్రాణాంతక కరోనా వైరస్ సమయంలో డాక్టర్లు, నర్సులు..ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి కొవిడ్-19 రోగులకు చికిత్స అందిస్తున్నారు. మెడికల్ సిబ్బంది అంతా సేవే పరమావధిగా పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది డాక్టర్లు, నర్సులు నేరుగా రోగి దగ్గరకు వెళ్లి పనిచేస్తున్నారు. అయితే ఎంబీబీఎస్ డాక్టర్ కు రానంత ఫాలోయింగ్ ఓ సాధారణ నర్సు దక్కించుకుంది. ఆ నర్సు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ నర్సుగా హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకింత ఫాలోయింగ్ అంటే ఆ నర్సు అంతా కరోనా మహిహ అంటోంది. అసలు వివరాల్లోకి వెళ్తే…
రష్యాలోని తులా ప్రాంతంలో ప్రాంతీయ క్లినికల్ హాస్పిటల్ లో పనిచేసే ఓ నర్సు కేవలం లో దుస్తుల పైన కరోనా వైరస్ సేప్టీ గా పీపీఈ సూట్ ధరించింది. దీంతో అమ్మడు లో దుస్తుల్లో హాట్ హాట్ గా కనిపించే సరికి సోషల్ మీడియాలో ఆఫోటోని షేర్ చేయడం మొదలు పెట్టారు. మరి ఈనర్సు ఎందుకిలా చేసిందంటే? ఆసక్తికర సంగతులే బయటపడ్డాయి. ఆసుపత్రి ఇచ్చిన ట్రాన్సఫరెంట్ పీపీఈ కిట్ ధరిస్తే ఊపిరాడటం లేదుట. లోపల అంతా ఉక్కపోతగా ఉంటుందిట. ఆ ఉక్కపోత భరించలేక లోదుస్తులపైనే పీపీఈ కిట్ ధరించినట్లు చెప్పింది. ఆసుపత్రులో విధులు నిర్వహిస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇలా బయటకు లీకై సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఆకతాయిలు ఈ నర్సు హాట్ ఫిక్ ను ఉద్దేశించి ఇష్టానుసారం కామెంట్లు చేయడం చర్చకు దారి తీసింది. దీంతో ఆనర్సుపై ఆదేశ వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ అయింది. ఆమె వాదనను వినిపించుకోకుండా డ్రెస్ కోడ్ ను ఉల్లంఘించినట్లుగా భావించి ఆమెపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే రంగుతో కూడిన నాణ్యమైన పీపీఈ కిట్లు ధరించి ఉంటే తనికి ఇలాంటి ఇబ్బంది ఎదురయ్యేది కాదని వాపోయింది. ప్రాణానికి తెగించి సేవ చేస్తున్నాను? అన్న విషయాన్ని కూడా ప్రభుత్వం మర్చిపోవడం బాధకరమంది. గవర్నమెంట్ అందించే పీపీఈ కిట్లు లోపల కూడా సౌకర్యంగా ఉండేలా చూడాలని అంది నర్సు. పీపీఈ కిట్లపై భారత డాక్టర్లు, నర్సులు సైతం ధరించడం చాలా ఇబ్బందిగా ఉందని, ఉక్కపోత భరించలేకపోతున్నామన్నారు. పైగా ఆ డ్రెస్ రోజంతా ఉంచుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని అభిప్రాయ పడిన సంగతి తెలిసిందే.