Corona Waves: కరోనా మహమ్మారి దాటికి ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలను పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ అంతకంతకు వ్యాప్తిచెందుతుంది. ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్నీ గడగడలాడించింది. అయితే మరొకసారి కొత్త కరోనా విజృంభిస్తుండడంతో ఇప్పటికే పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే డబ్ల్యుహెచ్ఓ అవునా ఇంకా ముగిసిపోలేదు అని హెచ్చరికలు జారీ చేసింది. యూరప్ ఆసియా లాంటి పలు దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఇక భారతదేశంలో భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తవడంతో, ఇప్పుడు వచ్చే కొత్త వేవ్ ప్రభావం చూపించక పోవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్పుడు దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కొత్త వేరియంట్ వచ్చినా ప్రభావం మాత్రం తక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నారు. మూడు వేవ్ ల తరువాత యాంటీబాడీ స్థాయిలు తగ్గినప్పటికీ హైబ్రిడ్ ఇమ్యూనిటీ రక్షణ కల్పిస్తుంది అని తెలిపారు. వృద్ధులు,కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నవారు మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని అదేవిధంగా బౌతిక దూరాన్ని పాటించాలి అని నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా దేశంలో విస్తరిస్తున్న కొత్త వేరియంట్ ల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఇన్సాకాగ్ కు నమూనాలను ఎప్పటికప్పుడు పంపించాలి అని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. అయితే దేశంలో కోవిడ్ విస్తృతి తగ్గుతున్నప్పటికీ భవిష్యత్తులో వైరస్ లో మ్యూటేషన్లు సంభవిస్తాయి అని తెలిపారు.
అయితే ఇప్పటివరకు దాదాపుగా 1000 మ్యూటేషన్లు జరిగినప్పటికీ వాటిలో కేవలం 5 మాత్రమే ఆందోళనకరమైనవి అని వీటితో పాటుగా భవిష్యత్తులో కొత్త వేరియంట్లను పసిగట్టడానికి జీనోమ్ సీక్వేన్సింగ్ తో పర్యవేక్షిస్తూ నే ఉండాలి అని తెలిపారు.ఇక ఇప్పటికే దేశంలో 80 నుంచి 90 శాతం ప్రజలు వైరస్ బారిన పడ్డారని, కొత్త వేవ్ వచ్చినప్పటికీ తీవ్ర లక్షణాలు ఉండకపోవచ్చు అని నిపుణులు వెల్లడించారు. అయినప్పటికీ కొత్త వేరియంట్లు పుట్టుకు వచ్చే ప్రమాదం ఉన్నందున, నిర్లక్ష్యం వహించే కూడదు అని వివరించారు.