Amitabh Bachchan: బిగ్ బి ఇంట్లో కరోనా కలకలం.. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు!

Amitabh Bachchan: దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కలవరం మొదలైంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు రాష్ట్రాలలో ఎన్నో ఆంక్షలు విధించగా మరికొన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలు చేశారు.ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ కరోనా మహమ్మారి బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్ అబ్రహం దంపతులు, కరీనా కపూర్, వంటి ఎంతో మంది సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడే కోలుకుంటున్నారు.

కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో మరోసారి కరోనా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కరోనా రెండవ దశలో అమితాబచ్చన్ అభిషేక్ బచ్చన్ కరోనా బారిన పడిన విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి బిగ్ బీ ఇంట్లో కరోనా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

ముంబైలోని అమితాబ్‌ నివాసమైన జల్సాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వెంటనే బిగ్ బి కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. ఈయన ఇంట్లో సుమారు 31 మందిఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరందరికీ ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించి వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది. అయితే అతనికి ఎవరివల్ల కరోనా సోకిందనే విషయం తెలియాల్సి ఉంది. ఇలా వారి ఇంట్లో పనిచేసే ఉద్యోగి కరోనా రావడంతో అమితాబచ్చన్ వారి ఉద్యోగుల పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల ఎన్నో జాగ్రత్తలు వహిస్తూ అప్రమత్తమయ్యారు.