ఐదారు నెలలుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఒణికిస్తోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ మహమ్మారి ఇంకెన్నాళ్లు ఉంటుందో తెలియదు గానీ ఉన్నన్నాళ్లు తిప్పలైతే తప్పవు. ముక్కుకి మాస్క్ కట్టుకోవాలి. చీటీకి మాటికి శానిటైజర్ పూసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడానికి వీలు లేదు. ఇలా మహమ్మారిని దరి చేరనీయకుండా చేయాలంటే? ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వారకూ ఇవన్నీ చేయక తప్పదు. అటు జ్యోతిష్యులు…సామాజిక వేత్తలు..తత్వ వేత్తలు కరోనా గురించి రకరకాలు చెప్పడం సోషల్ మీడియాని హీటెక్కిస్తుంది.
కాలజ్ఞానంలో వీర బ్రహ్మంగారు కోరంగి అనే జబ్బుతో కొటి మందైనా చనిపోతారని చెప్పారు. గతంలో ఆయన చెప్పినవీ కొన్ని జరిగాయని నమ్మిన వాళ్లు ఉన్నారు. ఇలా రకరకాల ప్రచారాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా అంటే బ్రహ్మంగారు చెప్పినట్లు కోరంగి అనే అంటున్నారు. ఆ రెండు పేర్లకు దగ్గర సంబంధం ఉంది…ఇది జరిగి తీరుతుందంటూ భారత్ లో ఎక్కువ జనాలు నమ్మడం విశేషం. అయితే తాజాగా మెక్సికో దేశంలోని మాంటోమోరోలెస్ మున్సిపాలిటీలో ఈ వైరస్ రూపంలో ఉన్న వడగళ్లు పడటం అక్కడ ప్రజల్ని ఆశ్చర్యపరిచింది. అక్కడ పడిన వడగళ్లు అచ్చంగా వైరస్ నోట్లోంచి ఊడిపడినట్లే ఉన్నాయి.
దీంతో ఇదంతా భగవంతుడి లీల అంటూ చాలా మంది జనాలు నమ్ముతున్నారు. మందు లేని జబ్బులు రావడం. వాతావరణం లో ఊహించని మార్పులు. పెను తుఫాన్లు. ప్రకృతి వైపరిత్యాలు ఇవన్నీ యుగాంతానికి సంకేతం కాక మరేంటి? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. వాస్తవం కన్నా అవాస్తవం జనాల్లోకి తొందరగా వెళ్లిపోతుందటారు. ఇప్పుడీ రూమర్లు జనాల్లోకి మెరుపు వేగతంతో వెళ్లిపోతున్నాయి. వైరస్ రూపం కల్గిన వడగళ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నలుగుతోంది. హిందు దేశమైన భారత్ లో ఆ వడగళ్లు మరింత విష ప్రచారానికి దారి తీస్తున్నాయి.